ETV Bharat / city

ఫిర్యాదులను నిర్దేశిత కాలంలో పరిష్కరించాలి: సీఎం

గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చిన ఫిర్యాదులు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు కూడా షెడ్యూలు ప్రకటించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

cm jagan
cm jagan
author img

By

Published : Aug 10, 2020, 3:17 PM IST

Updated : Aug 10, 2020, 5:27 PM IST

గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్తగా మరో కాల్ సెంటర్​ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్... ఈ కాల్ సెంటర్​ను క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) పేరిట ప్రత్యేక వ్యవస్థ పని చేయనుంది.

అక్టోబరు నాటికి పూర్తి స్థాయిలో...

తొలుత గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే నాలుగు సేవలతో ఈ కాల్ సెంటర్ ప్రారంభించారు. ఆ తదుపరి అక్టోబరు నాటికి సచివాలయాల్లో అందించే 543 సేవలపై ఫిర్యాదులను స్వీకరించటం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలను కూడా ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు, వాటి మార్గదర్శకాలను ప్రజలకు తెలియపరిచేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయాల ద్వారా ఆధార్ కార్డుల జారీ అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అధికారులు దీనికి కేంద్రం అంగీకరించదని సీఎంకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరగాలని.. దీనికి సంబంధించి షెడ్యూలు ప్రకటించాలని ఆధికారులను ఆదేశించారు.

అంతర్జాల సదుపాయం...

మారుమూల ప్రాంతాల్లో ఉన్న సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా సీఎం ప్రారంభించారు. అంతర్జాల సదుపాయం లేని 512 గ్రామ సచివాలయాలు ఈ వ్యవస్థ ద్వారా అనుసంధానం కానున్నాయి. మరోవైపు అర్బన్‌ హెల్త్‌ క్లినిక్​లపైనా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఇళ్ల పట్టాల దరఖాస్తుల పరిశీలనకు 90 రోజులు గడువున్నా.. వేగంగా వాటిని పరిష్కరించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

ఇదీ చదవండి

నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన ప్రభుత్వం

Last Updated : Aug 10, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.