ETV Bharat / city

90 రోజుల్లో ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాలి: జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

కరోనా నివారణ కోసం పటిష్టమైన క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కొవిడ్‌ పరీక్షలు చేయడంలో స్పష్టమైన వ్యూహాన్ని, హేతుబద్దత అమలు చేయాలన్నారు.

cm jagan helds review meeting on corona tests
ప్రతి కటుంబానికి 90 రోజుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలన్న సీఎం జగన్
author img

By

Published : Jun 22, 2020, 7:25 PM IST

కొవిడ్‌ నివారణకు క్షేత్రస్థాయిలో పక్కా వ్యూహాలు అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 90 రోజుల్లో స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. వైరస్‌పై ప్రజలకు భయం పోగొట్టేలా... విస్తృత ప్రచారం చేయాలని నిర్దేశించారు.

ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్ పరీక్షలు

వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్‌, కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కొవిడ్‌ వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం... కరోనా నిర్ధరణకు నమూనాలు సేకరించే సదుపాయాలున్న 104 వాహనాలను ప్రతి మండలానికీ ఒకటి మంజూరు చేయాలన్నారు. 104 సిబ్బంది సహా... అదే గ్రామానికి చెందిన ఏఎన్​ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను ఒక బృందంగా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి మందులు అక్కడే ఇవ్వాలన్నారు. ప్రతి నెలలో కనీసం ఒకసారి గ్రామాల్లో 104 వాహనం ద్వారా వైద్యసేవలు, స్క్రీనింగ్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల వివరాలను క్యూఆర్ కోడ్‌ ఉన్న ఆరోగ్యకార్డులో పొందుపరచాలని సూచించారు. పట్టణాల్లో ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని ఆదేశించారు.

ప్రజలు భయాందోళనలు తొలగించాలి

క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థల ద్వారానే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడం ద్వారా వైరస్‌ను అడ్డుకోగలమన్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో 50 శాతం పరీక్షలు చేయాలని... మిగతా 50 శాతంలో తమకు తాముగా కొవిడ్‌ పరీక్షల కోసం ముందుకు వచ్చేవారికి, కాల్‌ సెంటర్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి చేయాలన్నారు. వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉన్న హైరిస్క్‌ రంగాలు, గ్రూపుల్లోనూ పరీక్షలు చేయాలని సీఎం జగన్ సూచించారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించేలా అవగాహన కల్పించాలన్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం ఉద్ధృతం చేయాలని ఆదేశించారు.

జులై 1 నాటికి అంతా సిద్దం

ప్రస్తుతం రోజుకు 24 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు... సీఎంకు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. 60 ఏళ్లకు పైబడిన వారితో సహా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 40 ఏళ్లు దాటిన వారికి.. కనీసం 60 శాతం పరీక్షలు జరుపుతున్నట్లు వెల్లడించారు. మరణాల రేటు తగ్గించేందుకు ఈ వ్యూహం ఎంపిక చేసినట్లు చెప్పారు. తర్వాతి ప్రాధాన్యత కంటైన్‌మెంట్‌ జోన్లు, హైరిస్క్‌ గ్రూపులకు ఇస్తున్నట్లు తెలిపారు.

పరిశ్రమలు, మాల్స్‌, ఆలయాలు, మార్కెట్‌ యార్డులు తదితర విభాగాల్లో... ర్యాండమ్‌ టెస్టులు చేస్తున్నామన్నారు. 104, 108 కొత్త వాహనాలను జులై 1 నాటికి సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని సమీప ప్రాంతాల్లో... టెస్టింగ్‌, చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో ఉంచుకుని... అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

మనుషులకైనా, పశువులకైనా, ఆక్వా రంగంలో వినియోగించే ఔషధాలకైనా.... డబ్ల్యూహెచ్​వో, జీఎంపీ ప్రమాణాలు పాటించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో కొత్తగా ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

ఇదీ చదవండి:

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.