CM Jagan and MLAs pay tribute: అంబేడ్కర్ జయంతి సందర్భంగా తన నివాసంలో అంబేడ్కర్ చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సురేశ్, పినిపే విశ్వరూప్, నాగార్జున పాల్గొన్నారు.
-
రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2022రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2022
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు... అంబేడ్కర్ చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఎస్సీ వాడల్లో కల్యాణ మండపాలు నిర్మించాలని ఎమ్మెల్యే వెంకట్రావు అన్నారు. కల్యాణ మండపాల నిర్మాణంపై మంత్రి నాగార్జున సీఎం దృష్టికి తేవాలని చెప్పారు. ఎస్సీ వాడల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, కలెక్టర్, జేసీ, ఎస్పీ పాల్గొన్నారు. వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. అంబేడ్కర్ జీవిత చరిత్రపై ఫొటో ప్రదర్శనను మంత్రులు తిలకించారు.
విజయవాడలో అంబేడ్కర్‌కు మంత్రి మేరుగ నాగార్జున నివాళులర్పించారు. అస్పృశ్యత నివారణకు అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు. విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి నాగార్జున తెలిపారు. అంబేడ్కర్ విగ్రహం కోసం రూ.230 కోట్లు ఖర్చుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. దేశ రాజకీయాల్లోనే కలికి తురాయిలా ఏపీలో పాలన ఉంది చెప్పారు. గతంలో పేదల పేర్లతో మంత్రుల బినామీలకు లోన్లు ఇచ్చారని వెల్లడించారు. నవరత్నాల ద్వారా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాల ఉందుతున్నాయని మంత్రి నాగార్జున స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Eluru fire accident: ఏలూరు అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని సహా ప్రముఖుల దిగ్బ్రాంతి