ETV Bharat / city

Karate Kalyani: నటి కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్‌ లేబర్ అధికారుల సోదాలు.. - telangana news

Karate Kalyani: హైదరాబాద్​లోని సినీ నటి కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్‌ లేబర్ అధికారులు సోదాలు నిర్వహించారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

child welfare officials raid on actress karate kalyani home
karate kalyani
author img

By

Published : May 16, 2022, 1:38 AM IST

Karate Kalyani: కరాటే కల్యాణి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. కల్యాణి ఇంట్లో చైల్డ్‌ లేబర్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్​ ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్​ స్టేషన్ పరిధి మోతీనగర్‌లోని రాజీవ్‌నగర్‌లో ఉన్న కరాటే కల్యాణి నివాసంలో ఈ తనిఖీలు జరిగాయి. కరాటే కళ్యాణి పలువురు చిన్నారులను కిడ్నాప్‌ చేయడంతో పాటు 2నెలల పిల్లలను కొనుగోలు చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. నెలల వయస్సున్న పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో విచారణ కోసం ఆమె నివాసానికి వచ్చినట్లు చైల్డ్‌ లేబర్ అధికారులు తెలిపారు. చైల్డ్‌ లేబర్ లైన్‌ కమిటీ సభ్యులు సంతోష్‌, మహేష్ ఆధ్వర్యంలో కరాటే కల్యాణి నివాసంపై సోదాలు జరిగాయి.

కరాటే కల్యాణి ఇంట్లో అధికారులు ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కరాటే కల్యాణి తల్లి, సోదరుడిని చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీం అధికారులు ప్రశ్నించారు. ఓ దంపతులకు పుట్టిన మూడో ఆడబిడ్డను కల్యాణి పెంచుకుంటోందని ఆమె తల్లి విజయలక్ష్మి అధికారులకు వివరించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా పాపను తెచ్చుకున్నామని తెలిపింది. పాపను న్యాయబద్ధంగానే దత్తత తీసుకుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. అయితే చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే యూట్యూబర్​ శ్రీకాంత్​రెడ్డితో కరాటే కళ్యాణి మధ్య వివాదం హాట్​ టాపిక్​గా మారింది. శ్రీకాంత్​రెడ్డి చేసే వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి.. అతడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీయటంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వివాదంపై అటు శ్రీకాంత్​రెడ్డి, ఇటు కరాటే కల్యాణి.. ఎస్సార్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఇద్దరు ఫిర్యాదు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.