పంచాయతీల నుంచి తిరుపతి ఉప ఎన్నిక వరకు అన్ని ఎన్నికల్లో వరుస పరాజయాలతో మొహం చెల్లకే.. అసెంబ్లీ సమావేశాలను తెదేపా బహిష్కరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు, తెదేపా నేతలకు లేదన్నారు. అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా.. ఇప్పటికీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే.. చంద్రబాబు చేస్తోన్న కుట్రలు బయట పడతాయని భయంతో మొహం చాటేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: 'సైన్యంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి'
దేవాలయాలు, చర్చిలు, రఘురామకృష్ణరాజు.. ఇలా ఏదో ఒక సమస్యను సృష్టించి రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. ప్రజాప్రాధాన్య అంశాల గురించి చర్చించలేక శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ప్రకటించి ఉంటే బాగుండేదనన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. ఎమ్మెల్యేలకు నిర్ధరణ పరీక్షలు చేసి, నెగిటివ్ వచ్చిన తర్వాతే అసెంబ్లీ సమావేశాలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. అయినా తెదేపా నేతలు ఎందుకు భయపడుతున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్రలో భాగంగా.. ఆయన డైరెక్షన్లోనే ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నాడని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: రూ.10 లక్షల పరిహారం పంపిణీకి ఉత్తర్వులు జారీ