ETV Bharat / city

సీఎస్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ - chandrababu letter to chief secretary over formers problems

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా ప్రభావం వల్ల ఇబ్బందిపడుతున్న ఉద్యానవన రైతులు, ప్రౌల్ట్రీ, ఆక్వా రంగాల వారిని ఆదుకోవాలని కోరారు.

chandrababu letter to chief secretary over formers problems

author img

By

Published : Mar 26, 2020, 3:36 PM IST

కరోనా ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యానవన రైతులు, పౌల్ట్రీ, ఆక్వా రంగాల వారిని ఆదుకోవాలని సీఎస్​ నీలం సాహ్నికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆయా రంగాల వారు పడుతున్న ఇబ్బందులను లేఖలో వివరించారు. రవాణా వ్యవస్థ స్తంభించిన కారణంగా.. మద్దతు ధర లేక, ఉత్పత్తులను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. కనీస మద్దతు ధర కల్పించటమే గాక.. వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. వ్యవసాయ రంగం సంక్షోభం భారిన పడకుండా రైతులకు ప్రభుత్వ తోడ్పాటును ఇవ్వాలని కోరారు. ఆక్వా, పౌల్ట్రీ రంగాలకు దాణా రవాణా నిలిచిపోయిన కారణంగా.. ఆయా రంగాలు కుదేలవుతున్నాయని లేఖలో చెప్పారు. సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

ఇదీ చదవండి:

కరోనా నివారణ చర్యలకు ఎంపీ సీఎం రమేశ్ భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.