ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన పీవీ సింధుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డగా సింధును ప్రశంసించారు. బ్యాడ్మింటన్‌లో ఆమె విజయాలు స్ఫూర్తి దాయకాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. దేశానికి, తెలుగు జాతికీ గొప్ప పేరు ప్రతిష్ఠలు తేవాలని, ఆమె స్ఫూర్తితో వర్ధమాన క్రీడాకారులు మరింత రాణించాలని చంద్రబాబు కోరారు. సింధు తల్లితండ్రులను, కోచ్ గోపీచంద్‌కు ప్రత్యేకంగా అభినందించారు.
ఇవీ చదవండి