ఎస్ఈసీగా రమేశ్ కుమార్ తొలగింపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ విషయంలో కేంద్రం, ప్రధానితో మాట్లాడకుండా గవర్నర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్... న్యాయస్థానాల్లో నిలబడదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు కుదరవన్న ఆయన... రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ వ్యవహరించడం తగదని అన్నారు.
ఇదీ చదవండి: