శాసనసభ సమావేశాలను డిసెంబరు మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండ్రోజుల్లో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు ఇతర బిల్లులను సర్కారు ప్రవేశపెట్టనుంది. జూన్లో వర్షాకాల సమావేశాలను నిర్వహించిన ప్రభుత్వం… 6 నెలల్లోగా మరోమారు శాసనసభను సమావేశపరచాలి. అందువల్ల డిసెంబరు మొదటి వారంలో సమావేశాలు నిర్వహించాలని సంకల్పించింది.
ఇదీ చూడండి: