ETV Bharat / city

నేటి నుంచి ఏపీఎస్​ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సులు - విశాఖపట్నం

APSRTC: శరన్నవరాత్రులు, దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్​ఆర్టీసీ నేటి నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడపనున్న ఈ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

APSRTC
ఏపీఎస్​ఆర్టీసీ
author img

By

Published : Sep 29, 2022, 10:28 PM IST

Updated : Sep 30, 2022, 6:43 AM IST

Apsrtc Special Busses: శరన్నవరాత్రులు, దసరా పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అదనంగా 1072 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 10 వరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలు సహా ఇతర రాష్ట్రాలకూ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ రీజినల్​ మేనేజర్​ యేసు దానం తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తారని.. ఎలాంటి అదనపు చార్జీలు ఉండవన్నారు.

విజయవాడ నుంచి హైదరాబాద్​కు 338, రాజమహేంద్రవరానికి 283 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ నుంచి విశాఖపట్నానికి 139, బెంగళూరుకు 10, చెన్నైకి 69 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా అవసరమైన ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఉందని.. ప్రయాణికులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 30, 2022, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.