ETV Bharat / city

AP TOPNEWS ప్రధానవార్తలు@9am - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

AP TOPNEWS
ప్రధానవార్తలు9am
author img

By

Published : Oct 11, 2022, 9:03 AM IST

  • బతికుండగానే చంపేశారు.. నకిలీ పత్రాలతో కోటిన్నర కొట్టేశారు..

ఓ స్థిరాస్తిపై కన్నేసిన అక్రమార్కులు... యజమాని దంపతులను బతికుండగానే చంపేశారు. వారి సొంత కుమారులను కాదని... ఓ నకిలీ వారసుడిని సృష్టించారు. ఆ ధ్రువపత్రాలను మున్సిపల్‌ కమిషనర్‌ సహా రెవెన్యూ అధికారులూ ధ్రువీకరించారు. ఆస్తి ఉన్న ఊళ్లో కాకుండా... నకిలీ పత్రాలతో మరోచోట రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. నకిలీ పత్రాలని స్పష్టంగా తెలుస్తున్నా... సబ్‌ రిజిస్ట్రార్ వెనుకాముందూ చూడకుండా కోటిన్నర విలువచేసే ఇంటి అమ్మకానికి రాజముద్ర వేసి రిజిస్టర్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మొక్కజొన్న 'రైతుల గోడు'.. కష్టానికి కన్నీరే ప్రతిఫలం

వడ్డీకి తెచ్చిన అప్పులతో పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం శ్రమించి పంట పండించారు. దిగుబడి బాగుంది, నాలుగు రూపాయలు చేతికొస్తాయని సంబరపడే లోపే.. వారం రోజులుగా కురుస్తున్న వర్షం శాపంలా మారింది. కోసిన మెుక్కజొన్న పొత్తులు మెులకెత్తడంతో.. విజయనగరం జిల్లా రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పదినెలల చిన్నారిని తండ్రికి అప్పగించడానికి నిరాకరించిన హైకోర్టు

అనారోగ్యంతో తల్లి కన్నుమూశాక.. అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో ఉంటున్న పదినెలల చిన్నారిని తండ్రికి అప్పగించడానికి హైకోర్టు నిరాకరించింది. అమ్మమ్మ, తాతయ్య వద్ద ఆ చిన్నారి ‘అక్రమ నిర్బంధం’లో ఉందని పాప తండ్రి రుజువు చేయడంలో విఫలమయ్యారని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని అక్రమ నిర్బంధంగా ప్రకటించలేమని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్‌లో నోరూరించే ఐస్​క్రీముల పండుగ

భారత ఐస్‌క్రీమ్ తయారీదారుల సంఘం ఐఐసీఎమ్‌ఏ ఆధ్వర్యంలో ఇండియన్‌ ఐస్‌క్రీమ్ ఎక్స్‌పో పదో ఎడిషన్‌ ఐఏఎస్‌ అనిత ప్రవీణ్‌ చేతుల మీదుగా నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో వివిధ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్స్‌కు సంబంధించిన వివిధ ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్‌లను ప్రదర్శనకు ఉంచుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'విద్వేష ప్రసంగాలపై మీ వాదన సబబే కావొచ్చు'.. తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం

దేశంలోని మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరిన్ని వివరాలతో ఈ నెల 31లోపు అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. తలాక్‌ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన శునకం...

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్‌ చేతికి స్విస్‌ ఖాతాల నాలుగో జాబితా.. పెరిగిన లక్ష అకౌంట్లు

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ పౌరులు/సంస్థలకు చెందిన అకౌంట్ల వివరాలతో కూడిన నాలుగో జాబితా భారత్‌కు చేరింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించి తాజా జాబితాను అందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దసరాకు జోరుగా అమ్మకాలు.. 5.4 లక్షల వాహనాలు విక్రయం!

దసరా నవరాత్రి పండగ సమయంలో దేశంలో వాహనాల రిటైల్‌ విక్రయాలు 57 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 5.4 లక్షలకు చేరినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5 మధ్య మొత్తం వాహనాల రిటైల్‌ విక్రయాలు 5,39,227గా నమోదయ్యాయి. గతేడాది నవరాత్రి సమయంలో రిటైల్‌ విక్రయాలు 3,42,459గా ఉన్నాయి. కొవిడ్‌ ముందునాటి 2019 నవరాత్రి సమయంలో అమ్ముడుపోయిన 4,66,128 వాహనాలతో పోల్చినా ఈసారే ఎక్కువగా జరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సమరానికి సై.. అమెరికాతో భారత్‌ ఢీ

ఫుట్‌బాల్‌లో మన గతమెంతో ఘనం. అదో స్వర్ణ యుగం. కానీ ప్రస్తుత పరిస్థితి అంతంతమాత్రమే. సీనియర్‌ ప్రపంచకప్‌లో చోటు ఎంతో దూరం. ఈ తరుణంలో.. దేశంలో మరోసారి ఆ ఆటకు ఆదరణ పెంచేలా.. సాకర్‌ మాయలో అభిమానులు పడిపోయేలా చేసేందుకు అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ వచ్చేసింది. ఈ ఫిఫా సంగ్రామానికి మంగళవారమే తెరలేవనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బుల్లితెరపై అనిల్​ రావిపూడి, నటి స్నేహ సందడి.. ఆ షోకు స్పెషల్​ జడ్జ్​గా

తెలుగు తెరపై గుర్తుండిపోయే ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయిన నటి స్నేహ.. బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఈటీవీలో ప్రసారం కానున్న సరికొత్త రియాలిటీ షో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఒకరికి ఒకరు'కు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈమెతో పాటే దర్శకుడు అనిల్​రావిపూడి కూడా ఈ కార్యక్రమాంలో స్పెషల్​ జడ్జిగా కనిపించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.