ETV Bharat / city

ఏపీ ప్రధానవార్తలు@9am

.

ap topnews
ఏపీ ప్రధానవార్తలు@9am
author img

By

Published : Sep 13, 2022, 9:00 AM IST

  • మరోమారు ఉద్యమ శంఖారావం.. మొదటి రోజు విజయవంతమైన రైతుల మహా పాదయాత్ర

రాజధాని అమరావతిలో తూర్పున వెలుగురేఖలు ప్రసరించక ముందే... ఉద్యమ శంఖారావాలు ప్రతిధ్వనించాయి. జై అమరావతి... జయహో అమరావతి... నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి... అమరావతి నుంచి అరసవల్లి దాకా రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర సోమవారం ఉదయం గోవింద నామాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైంది. రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, రైతుకూలీలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

  • లేపాక్షి భూముల్లో జగన్నాటక సూత్రధారులకు ఎదురుదెబ్బ!

ప్రజలకు సంబంధించిన వేల ఎకరాల లేపాక్షి నాలెడ్జి హబ్‌ భూములతో ముడిపడి ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియ అమలులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దివాలా ప్రక్రియలో కంపెనీని రూ.500 కోట్లకు దక్కించుకున్న ఎర్తిన్‌ కన్సార్షియం ప్రస్తుతానికి రంగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఎర్తిన్‌ నుంచి తమకు డబ్బు సకాలంలో అందలేదని.. మరోసారి కొత్తగా దివాలా ప్రక్రియను చేపట్టేందుకు అనుమతివ్వాలంటూ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ‘రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌’ చేసిన విజ్ఞప్తిని ఆమోదిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ¨) హైదరాబాద్‌ శాఖ ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేసింది.

  • రాష్ట్ర పునర్విభజన కేసులో ఏపీ హైకోర్టు విచారణపై సుప్రీం స్టే

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలను అమలు చేయాలంటూ ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు రాష్ట్ర పునర్విభజనపై తెలంగాణకు చెందిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పలువురు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కొణతాల పిటిషన్‌ను ఇక్కడికే బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో బదిలీ పిటిషన్‌ వేసింది.

  • సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

సికింద్రాబాద్‌లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జ్‌లో ఘటన జరిగింది. సెల్లార్‌లో ఎలక్ట్రికల్‌ ద్విచక్రవాహనాల బ్యాటరీలు పేలి మంటలు పైన ఉన్న లాడ్జీలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.

  • ఆరోగ్య వ్యయం రూ.6 లక్షల కోట్లు.. ప్రభుత్వం కంటే ప్రజలపై భారమే అధికం

ఆరోగ్యంపై ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి రూ.5.96 లక్షల కోట్లు ఖర్చయినట్లు కేంద్రం వెల్లడించింది. ఇది జీడీపీలో 3.16 శాతానికి సమానం. ఈ మేరకు 2018-19లో ఖర్చులపై కేంద్రం నివేదిక విడుదల చేసింది. ప్రభుత్వాలు ఖర్చు చేసేదానికంటే ప్రజలపై భారమే అధికంగా ఉంటోందని నివేదిక తేటతెల్లం చేసింది.

  • నిక్కరు పోస్టుపై దుమారం.. కాంగ్రెస్​పై భాజపా, ఆర్ఎస్ఎస్ ఎదురుదాడి

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కరు తగలబడుతున్న ఫొటోను కాంగ్రెస్‌ ట్విట్టర్​లో పోస్ట్‌ చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. ఫొటోపై మరో 145 రోజులు మాత్రమే భారత్‌ జోడో యాత్ర ఉందనే క్యాప్షన్‌ రాసి ఉంది. ఆ ట్వీట్​పై ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌ వైద్య తీవ్రంగా స్పందించారు. ప్రజలను ద్వేషిస్తూనే వారికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోందని అన్నారు.

  • బ్రిటన్ రాణి రహస్య లేఖ.. 2085 వరకు తెరవడానికి వీల్లేదు.. ఎవరికి రాశారో తెలుసా?

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 అస్తమయంతో ఆమెకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమెకు ఆస్ట్రేలియాతో ముడిపడిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రపంచానికి తెలిసింది. ఇదంతా రాణి రాసిన లేఖ గురించే. ప్రస్తుతం ఆ లేఖను సిడ్నీలో ఓ రహస్య ప్రాంతంలో భద్రపర్చారట. మరో 63 ఏళ్ల వరకు దానిని తెరిచే వీలు లేదట..!

  • ఇకపై ఎలక్ట్రిక్​ హైవేలు.. టోల్​ప్లాజా వద్ద ఇక 'ఆగేదే లే'

త్వరలో ఎలక్ట్రిక్​ హైవేలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. ఇకపై రైళ్ల లానే వాహనాలు కూడా రోడ్లపై పరుగులు తీయనున్నాయి. మరోవైపు టోల్‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను తీసుకురానుంది కేంద్రం.

  • వారిని దూరం పెట్టి.. వీరికి పట్టం కట్టి.. టీమ్ ఇండియా ఎంపికలో ఇదేం వ్యూహం?

టీ20 ప్రపంచ కప్​ కోసం ఆటగాళ్లను ఎంపిక చేసిన విధానాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కొంతమంది ఆటగాళ్ల ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలువురికి అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

  • సీక్వెల్ ట్రెండ్.. తొలి భాగం బోల్తా.. కొనసాగింపు చిత్రం ఉంటుందా?

'అనగనగా..' అంటూ మొదలైన ప్రతి కథా.. సుఖాంతమో, విషాదాంతమో ఏదోరకంగా కంచికి చేరి శుభం కార్డు వేసుకోవల్సిందే. అయితే అన్ని కథల విషయంలోనూ ఇలాగే జరగాలని రూలేం లేదు. రెండు భాగాల ట్రెండ్‌ మొదలయ్యాక కంచికి చేరకుండా కొనసాగింపు బాట పడుతున్న చిత్రాల సంఖ్య ఎక్కువైంది. నిజానికి ఇలా కొనసాగింపు లక్ష్యంతో మొదలైన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కుతాయా? లేదా? అన్నది తొలి భాగం విజయంపైనే ఆధారపడి ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.