ETV Bharat / city

ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

డాక్టర్ సుధాకర్ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్ నమోదు చేసిన వాంగ్మూలానికి, ప్రభుత్వం చెబుతున్నదానికి పొంతన లేదని అభిప్రాయపడింది. ప్రభుత్వం సమర్పించిన వీడియోలు ఒకే నిడివితో లేకుండా ముక్కలు ముక్కలుగా ఉండటంపై కూడా ధర్మాసనం సందేహం వెలిబుచ్చింది.

ap high court
ap high court
author img

By

Published : May 23, 2020, 6:48 AM IST

డాక్టర్‌ సుధాకర్‌ను పరిశీలించిన మెజిస్ట్రేట్‌ ఆయన శరీరంపై ఆరు గాయాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ఒకటే గాయం ఉందని పేర్కొన్నారు. తేడా ఎందుకుంది? సుధాకర్‌ శరీరంపై అన్ని గాయాలుంటే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఒకటేనని ఏ విధంగా ధ్రువపత్రం ఇచ్చారు? అదేమంటే ఒకరిపై ఒకరు చెబుతున్నారు. డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో ఎన్నో సందేహాలున్నాయి. నిష్పాక్షిక దర్యాప్తు జరిపి అవి నివృత్తి కావాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలి. అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించమని ఆదేశిస్తున్నాం. - హైకోర్టు

మత్తు వైద్య నిపుణులు డాక్టర్‌ కె.సుధాకర్‌తో విశాఖలో పోలీసులు వ్యవహరించిన ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. మెజిస్ట్రేట్‌ నమోదు చేసిన వాంగ్మూలానికి, ప్రభుత్వం చెబుతున్నదానికి పొంతన లేదని అభిప్రాయపడింది. ఈ ఘటనలో కుట్ర ఉందేమోనని సందేహం వెలిబుచ్చింది. సుధాకర్‌కు ఒకటే గాయం ఉందని సీఎస్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారని గుర్తు చేసింది. డీజీపీ.. అవి విశాఖ పోలీసు కమిషనర్‌ చెప్పిన విషయాలని అంటుంటే, కమిషనర్‌ ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరణపత్రం ఇచ్చారని.. ఇలా ఒకరి మీద ఒకరు చెబుతున్నారని ఆక్షేపించింది. అన్ని గాయాలున్న సుధాకర్‌కు ఒక్క గాయమే ఉందని ప్రభుత్వ వైద్యుడు ఏ విధంగా ధ్రువీకరణ చేశారో ఆయన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది.

వీడియోలు ముక్కలుముక్కలుగా ఉన్నాయేంటి?
ప్రభుత్వం తరఫున సీఎస్‌, హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ దాఖలు చేసిన ప్రమాణపత్రాల్ని, వీడియో క్లిప్పింగ్‌లను ధర్మాసనం పరిశీలించింది. ప్రభుత్వం సమర్పించిన వీడియోలు ఒకే నిడివితో లేకుండా ముక్కలు ముక్కలుగా ఉండటంపై సందేహం వెలిబుచ్చింది. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వివేకానంద వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 16న విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ పోలీసులు, ఆటోడ్రైవర్లను దూషించారన్నారు. అసహజంగా ప్రవర్తించారన్నారు. కొంతమందిపై చేయిచేసుకున్నారన్నారు. అదుపు చేసేందుకే పోలీసులు ఆ విధంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. వీడియోలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. వాటిని పరిశీలించిన కోర్టు.. కొంతఅతిగా స్పందించినట్లుందని పేర్కొంది.

అంతమంది పోలీసులున్నా అదుపు చేయలేకపోయారా..?
ఈ కేసులో కోర్టుకు సహాయకుడిగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి స్పందిస్తూ.. సీఎస్‌ ఈ ఘటనను సొంతంగా పరిశీలించకుండానే డీజీపీ నివేదిక ఆధారంగానే కౌంటర్‌ దాఖలు చేశారన్నారు. బలహీనంగా ఉన్న డాక్టర్‌ సుధాకర్‌ను కట్టేసి కొడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోందన్నారు. ఏడుగురు పోలీసులు ఘటనలో ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. బలహీనంగా ఉన్న డాక్టర్‌ను అంతమంది పోలీసులు అదుపు చేయలేక కొట్టాల్సి వచ్చిందని చెప్పడం సమంజసంగా లేదంది. పోలీసులు దాఖలు చేసిన వీడియో క్లిప్పింగ్‌లపై వాస్తవాల్ని తేల్చాలని అమికస్‌క్యూరీ కోరారు. సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు వెల్లడవుతాయన్నారు.

ప్రభుత్వ వివరాల్ని విశ్వసించలేం
ప్రభుత్వ కౌంటర్లో సుధాకర్‌కు ఎడమ కనుబొమ్మపై స్వల్ప గాయమైనట్లు పేర్కొన్నారని, మెజిస్ట్రేట్‌ నివేదిక ప్రకారం ఆరు గాయాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘మెజిస్ట్రేట్‌ పంపిన ఫొటోలు అబద్ధం చెప్పవు కదా’ అని జీపీని ప్రశ్నించింది. ప్రభుత్వ వివరాల్ని నమ్మే పరిస్థితి లేదంది. మిగిలిన ఐదుగాయాల గురించి అధికారులు ఎందుకు ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన 16న జరిగితే.. మెజిస్ట్రేట్‌ 20న ఆసుపత్రికి వెళ్లి సుధాకర్‌ను పరిశీలించారని పేర్కొంది. నాలుగు రోజుల తర్వాత కూడా తగ్గలేదంటే అవి పెద్ద గాయాలేనని, అవి ఎప్పుడు, ఎలా అయ్యాయో తేలాల్సి ఉందంది. మెజిస్ట్రేట్‌ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే సుధాకర్‌ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు లేదని పేర్కొంది.

మెజిస్ట్రేట్‌ ముందు ఎందుకు హాజరుపరచలేదు?

‘సుధాకర్‌ను ఘటనా స్థలం నుండి పోలీస్‌స్టేషన్‌కు, అక్కడి నుండి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు గంటలపాటు స్టేషన్‌లో ఉంచినట్లు అర్థమవుతోంది. మెజిస్ట్రేట్‌ ముందు ఎందుకు హాజరుపరచలేదు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది అక్రమ నిర్బంధమా అన్నదీ తేలాల్సి ఉందని పేర్కొంది. ‘20వ తేదీన డాక్టర్‌ సుధాకర్‌ను మా ముందు హాజరుపరచాలని 18న ఆదేశించాం. 19న విశాఖ మానసిక ఆసుపత్రి వైద్యులు.. సుధాకర్‌ను పరిశీలించి మానసిక స్థితి బాగాలేదని చెబుతున్నారు. మరుసటి రోజు వైద్యబృందం కూడా ఇదే విషయం చెప్పింది. వీటిని పరిశీలిస్తే.. మేం జోక్యం చేసుకున్నాకే వైద్యులు నివేదికలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. వాటిపైనా అనుమానాలున్నాయి. సుధాకర్‌ తన వాంగ్మూలంలో పోలీసులు, అధికారులపై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును పోలీసులకు అప్పగించడం సరికాదు’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. పోలీసులు సుధాకర్‌పై నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:

వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.