ETV Bharat / city

Employees Protest: ఈనెల 7 నుంచి జనవరి 6 వరకు నిరసనలు.. సీఎస్​కు తెలిపిన ఉద్యోగ సంఘాలు

employee protest schedule: ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు.

EMPLOYEES UNION MEET CS
EMPLOYEES UNION MEET CS
author img

By

Published : Dec 1, 2021, 1:45 PM IST

Updated : Dec 1, 2021, 5:16 PM IST

ఉద్యోగ సంఘాల నేతలు

employees meet CS:పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నామని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. స్నేహపూర్వక గవర్నమెంట్ అని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు కన్నిటి మూటలే అయ్యాయని మండిపడ్డారు. ఉద్యమ కార్యాచరణను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని, ఇప్పటికీ పీఆర్సీ నివేదికను ఇవ్వలేదని విమర్శించారు. ఏడో తేదీలోగా సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ సమీర్ శర్మ హామీ ఇచ్చారని, జీపీఎఫ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఐదు పేజీల రిప్రజెంటేషన్ను ఉద్యమ కార్యాచరణ నోటీసు రూపంలో అందించామని ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు.

అక్టోబర్ నెలాఖరు నాటికి పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని సజ్జలే హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ప్రభుత్వానికి సహకరిస్తూన్నామని, 7 శాతం ఐఆర్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. పీఆర్సీ నివేదిక ఇచ్చి మూడేళ్లైనా విడతల వారీగా డీఏలు ఇస్తామన్నా జీతాల్లో 50 శాతం పెండింగులో పెడతామన్నా సహకరించామన్నారు. కరోనా సమయంలో 4-5 వేల మందికి ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని వాపోయారు. ఆర్ధికేతర సమస్యలను కూడా పరిష్కరించడం లేదని నిలదీశారు. చట్టబద్దంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవ్వరికీ లేదని తెల్చిచెప్పారు. పీఆర్సీ నివేదిక ఉద్యోగుల కు భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటిందని అంతటి కీలకమైన పీఆర్సీ నివేదికను కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.

పీఆర్సీ నివేదికలోని అంశాలు చెప్పకూడని అంశాలేమేమైనా ఉన్నాయా అని దుయ్యబట్టారు. బుగ్గన మాటలు ఉద్యోగులని కించపరిచే విధంగా ఉన్నాయన్న బొప్పన్న..., పీఆర్సీ అమలు విషయంలో ఆర్థిక మంత్రి ఉద్యోగులతో చర్చలు జరపడం సంప్రదాయమని గుర్తుచేశారు. బుగ్గన ఒక్క రోజైనా ఉద్యోగులతో మాట్లాడారా, అసలు బుగ్గన అందుబాటులో ఉన్నదెప్పుడని నిలదీశారు. తమకు రావాల్సిన కూలీలను మాత్రమే అడుగుతున్నమని, అంతకు మించి అడగొద్దని మంత్రి బుగ్గన గుర్తించాలన్నారు. రెండో దశ ఉద్యమంలోకి వెళ్లే లోపే ప్రభుత్వం స్పందించాలని హితవుపలికారు. సీఎం స్పందిస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని అర్ధమవుతోందన్నారు.

employee protest-schedule: 7 తేదీ నుంచి నల్లబ్యాడ్జీల తో ఉద్యోగులు నిరసన తెలియజేస్తారని, 10 తేదీన మధ్యాహ్న భోజన విరామ నిరసనలు చేస్తామని, 13 తేదీన తాలూకా, డివిజన్ల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 27 తేదీ నుంచి విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తామని బొప్పరాజు తెలిపారు.

ఇదీ చదవండి: AP Employees Unions future action for PRC: జగన్ సర్కారుపై ఉద్యోగ సంఘాల ఉద్యమం.. కార్యాచరణ ప్రకటించిన నేతలు

Last Updated : Dec 1, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.