జిల్లాల వారీగా మృతులు...
గుంటూరు జిల్లాలో 13, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో మృతిచెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 10 మంది చొప్పున కొవిడ్‌తో మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో ఏడుగురు, కడప జిల్లాలో ఏడుగురు, విశాఖ జిల్లాలో ఆరుగురు వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు. 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు.
జిల్లాల వారీగా కొత్త కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1332 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1235, పశ్చిమగోదావరి జిల్లాలో 929, విశాఖ జిల్లాలో 797, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 781, గుంటూరు జిల్లాలో 762, నెల్లూరు జిల్లాలో 723, విజయనగరం జిల్లాలో 593, శ్రీకాకుళం జిల్లాలో 511 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండీ... పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా