ETV Bharat / city

రాజధానిపై కమిటీల నివేదికను సవాలు చేస్తూ వ్యాజ్యం.. వివరణ కోరిన హైకోర్టు - రాజధానిపై కమిటీల నివేదిక వార్తలు

రాజధాని విషయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ, హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికలను సవాలు చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత పిల్​ను త్రిసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలతో జత చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బి. కృష్ణమోహన్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ap capital issue in high court
ap capital issue in high court
author img

By

Published : Jul 31, 2020, 2:18 AM IST

Updated : Jul 31, 2020, 2:54 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జీఎన్​రావు కమిటీ, హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికలను సవాలు చేస్తూ..మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలుచేసిన వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత పిల్‌ను.... త్రిసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలతో జతచేయాలని.. రిజిస్ట్రీకి స్పష్టంచేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. కమిటీలోని సభ్యులు ఆయా విభాగాల్లో నిపుణులు కాదన్నారు. రాజధాని వ్యవహారంతో ముడిపడిన వ్యాజ్యాలు.. త్రిసభ్య ధర్మాసనం ముందు ఆగస్టు 6న విచారణకు రానున్నట్లు.. ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారు. ప్రస్తుత వ్యాజ్యాన్ని వాటితో జత చేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ నాటికి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది.

ఇదీ చదవండి: తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 10,167 కేసులు నమోదు

Last Updated : Jul 31, 2020, 2:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.