ETV Bharat / city

కేబినెట్ కీలక నిర్ణయం... మరో కొత్త పథకానికి శ్రీకారం..! - key decisions in cabinet meeting

రాష్ట్రప్రభుత్వం మరో నూతన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్‌ 21న ‘వైఎస్​ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు జగన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద చేనేత కార్మికుల కుటుంబానికి ఏడాదికి రూ. 24వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వివరించింది.

కేబినెట్ కీలక నిర్ణయం
author img

By

Published : Oct 16, 2019, 6:58 PM IST

Updated : Oct 16, 2019, 11:39 PM IST

బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మత్స్యకార కుటుంబాలకు ఆర్థికసాయం ఆందజేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వేటనిషేధ సమయంలో ఇచ్చే సాయం రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది. మత్స్యకార బోట్లకు రూ.9 డీజిల్ రాయితీ ఇచ్చేందుకు నిర్ణయించారు. హోంగార్డుల జీతాల పెంపును ఆమోదించిన మంత్రివర్గం... కొత్త సంక్షేమ పథకాలకు విధివిధానాలపై మంత్రివర్గ భేటీలో చర్చించింది. చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం అందజేయడానికి 'వైఎస్‌ఆర్‌ చేనేత నేస్తం' పేరుతో పథకం అమలుకు ఆమోదం తెలిపింది. చేనేత నేస్తం పథకానికి రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన కేబినెట్... ఏటా డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఒకే విడత రూ.24 వేలు సాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చేనేత నేస్తం పథకం ద్వారా 90 వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. చిరుధాన్యాలు, అపరాలు, వరికి వేర్వేరు బోర్డుల ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల ఉపకారవేతనం ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. శ్రీకాళహస్తి-నడికుడి బ్రాడ్‌గేజ్ కోసం 350 ఎకరాలు కేటాయింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రేణిగుంట విమానాశ్రయం విస్తరణకు 17 ఎకరాలు కేటాయించజానికి సుముఖత వ్యక్తం చేసింది. గన్నవరం నియోజకవర్గంలో విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటుకు 39 ఎకరాలు కేటాయింపు చేసింది.

విశాఖలో ఆమోద పబ్లికేషన్స్‌కు ఇచ్చిన 1.5 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆర్టీసీలో కొత్తబస్సుల కొనుగోలుకు రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం హామీ ఇవ్వనుంది. రూ.4,771 కోట్ల బాండ్ల జారీకి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అనుమతించింది. తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందరికీ సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది.

మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హోంగార్డులకు ఇచ్చే రోజువారీ భత్యం రూ.710 పెంపునకు ఆమోదం తెలిపింది. పొరుగుసేవల ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. సాధారణ పరిపాలనశాఖ అజమాయిషీలో పొరుగుసేవల కార్పొరేషన్ పనిచేయనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బోర్లు వేసేందుకు రిగ్‌లు ఏర్పాటు, బోర్లు వేసేందుకు 200 రిగ్‌ల కొనుగోలుకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనేందుకు నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవవేతనాన్ని వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచుతూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. దీని కోసం అదనంగా రూ.211 కోట్ల మేర ఖర్చు చేయాల్సి రావొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. మద్యంపై అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను నిర్ణయానికి మంత్రి మండలి అమోదాన్ని తెలియచేసింది. కృష్ణా జిల్లా కొండపావులూరు వద్ద విపత్తు నిర్వహణ సంస్థకు 39 ఎకరాల భూమి, రేణిగుంట విమానాశ్రయం విస్తరణకు 17 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయిం తీసుకున్నారు. పాఠశాల్లో ఫీజుల నియంత్రణ పర్యవేక్షణా కమిషన్ యాక్టుపై ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది.

పేర్ని నాని

ఇదీ చదవండీ... తిరుమలగిరుల్లో చేతికందుతున్న మేఘాలు!

Last Updated : Oct 16, 2019, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.