రాష్ట్రంలో కిందటి ఆర్థిక సంవత్సరంలో (2019-20) బడ్జెట్ అంచనాల్లో కేవలం 73 శాతమే ఖర్చు చేయగలిగారు. ఆశించిన స్థాయిలో ఆదాయాలు లేకపోవడంతో ఖర్చులపైనా ఆ ప్రభావం కనిపించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా కేవలం కొద్ది ఎక్కువగానే ఖర్చు పెట్టగలిగారు. బడ్జెట్ అంచనాల్లో రూ.2,27,975 కోట్ల వ్యయానికి ప్రణాళికలు రూపొందించారు. ఆయా ప్రభుత్వ శాఖలకు కేటాయింపులు చూపించారు. అంచనాల్లో మూడొంతులు మాత్రమే ఖర్చు చేయడంతో ఆ ప్రభావం ప్రభుత్వ శాఖలపైనా పడింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,254.84 కోట్లు కేటాయించారు. వీటిలో కేవలంరూ.1,311.31 కోట్లు ఖర్చుచేశారు. జలవనరుల శాఖలో అంచనాల్లో మూడోవంతు మాత్రమే ఖర్చు పెట్టారు. భారీ, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులపై చేసిన ఖర్చూ తక్కువే. అందులోనూ అంతకు ముందు ఏడాది బిల్లుల చెల్లింపుదే సింహభాగం కావడం గమనార్హం.
అన్నింటిలోనూ కోతే
ఆదాయాలకు తగ్గట్లుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఖర్చులో కోత తప్పలేదు. ఒక్క బీసీ సంక్షేమ శాఖలోనే అంచనాల కన్నా కొద్ది మొత్తం అధికంగా వ్యయం చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
* రైతుభరోసా కింద రాష్ట్ర అభివృధ్ధి ప్రణాళిక కింద రూ.3,615.60 కోట్లు వ్యయం చూపారు. వైఎస్సార్ ఫసలీ బీమా యోజన కింద రూ.66.77 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు పేర్కొంటున్నాయి.
* బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.3,615 కోట్లు అంచనా వేశారు. అందులో కేవలం 472.77 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు.
ఇదీ చదవండి :