పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 288వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి, తుళ్లూరు, మందడం, ఐనవోలు, దొండపాడు, అనంతవరం, వెంకటపాలెం, బోరుపాలెంలలో రైతులు ఆందోళన కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు నినాదాలు చేశారు.
దేశంలోని పలు పార్టీల నేతలు 3 రాజధానులను వ్యతిరేకించారని దళిత మహిళ ఐకాస నేతలు గుర్తు చేశారు. తామంతా రాజధాని కోసం భూములిచ్చామని... ఇళ్ల స్థలాలకు కాదని గుర్తు చేశారు. జగన్ తన ప్రకటనను వెనక్కి తీసుకునే దాకా దీక్షా శిబిరాలను కొనసాగిస్తామని రైతులు తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: