ETV Bharat / city

"నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదు" - ap high court latest news

నిధుల కోసం అభ్యర్థిస్తూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ దాఖలుచేసిన వ్యాజ్యంలో... రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత మీది కాదా అని నిలదీసిన హైకోర్టు.... ప్రతీదానికి అడుక్కోవాలా అంటూ మండిపడింది. రాజ్యాంగ సంస్థలతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో బాగా తెలుసునని వ్యాఖ్యానించింది.

"నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదు"

author img

By

Published : Oct 23, 2020, 10:24 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వాన్ని సహాయ, సహకారాలు అందించేలా ఆదేశించాలని కోరుతూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహకారం కావాలో తెలియజేస్తూ అదనపు అఫిడవిట్ వేయాలని కోర్టు ఆదేశించింది. ఈమేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రకటించారు.

ఎస్‌ఈసీ అనుబంధ పిటిషన్‌లో ఏముందంటే.... ‘మేం దాఖలు చేసిన వ్యాజ్యం ఈనెల 20న విచారణకు వచ్చాకే ప్రభుత్వం రూ.39.63 లక్షలు విడుదల చేసింది. 6 బిల్లుల్ని పెండింగ్‌లోనే ఉంచారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధుల్లో ఎస్‌ఈసీకి ప్రభుత్వం సహకరించడం లేదు. ఆరేడు నెలలుగా ఎస్‌ఈసీ నియమించుకున్న న్యాయవాదులకు చెల్లించాల్సిన ఖర్చుల చెల్లింపు నిమిత్తం నిధులను విడుదల చేయాలని ఈఏడాది ఆగస్టు 5న ప్రభుత్వానికి వినతి సమర్పించాం. ఎస్‌ఈసీకి నిధుల అవసరముందని పేర్కొన్నాం. దానిపై స్పందించలేదు. నిధుల అవసరాన్ని గుర్తుచేస్తూ ఆగస్టు 24న, సెప్టెంబరు 9న వినతులు పంపాం. ఆగస్టు 25న గవర్నర్‌కూ విన్నవించాం. అయినా ఎన్నికల ప్రక్రియలో తగిన సహకారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ చర్య రాజ్యాంగంలోని అధికరణ 243కేను ఉల్లంఘించడమే. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంతో ప్రభుత్వం ఎస్‌ఈసీపై విరోధం పెంచుకుంది. కమిషనర్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రసార, సామాజిక మాధ్యమాల్లో దూషణలు చేశారు. తర్వాత ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదించి కమిషనర్‌ను తొలగించేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చారు. ఎస్‌ఈసీ, సహాయ కార్యదర్శిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఎన్నికల రికార్డులు సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించగా... తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆర్థిక, ఆర్థికేతర సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి’ అని కోరారు.

జస్టిస్‌ కనగరాజ్‌ ఎస్‌ఈసీగా ఉన్నప్పుడు న్యాయవాదుల ఫీజు బిల్లుల వివరాలు ఇవే

జస్టిస్‌ కనగరాజ్‌ ఎస్‌ఈసీగా నియమితులైనప్పుడు న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజుల బిల్లులను అనుబంధ పిటిషన్‌తో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ జతచేశారు. జస్టిస్‌ కనగరాజ్‌ తరఫున వాదించినందుకు, ఇతర ఖర్చుల కింద సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌కు రూ.58.70 లక్షల బిల్లులున్నాయన్నారు. ఒకసారి హాజరైతే రూ.3.3 లక్షలని, ఆయన 16సార్లు హాజరయ్యారన్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శి తరఫున నాలుగు సందర్భాల్లో హాజరైనందుకు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డికి రూ18 లక్షల బిల్లులు ఉన్నాయన్నారు. న్యాయవాది వీవీ ప్రభాకరరావుకు రూ.3లక్షలు, న్యాయవాది సీకే సుచరితకు రూ.9.15 లక్షలు, న్యాయవాది ఆత్మారాం నాద్‌కర్ణికి రూ.4.40 లక్షలు చెల్లించాల్సినవి ఉన్నాయన్నారు. కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేసినప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పుడు ఎన్నికల సంఘం తరఫున నియమించుకున్న సీనియర్‌ న్యాయవాదికి రూ.10.50 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. తమకు వ్యతిరేకంగా న్యాయవాదులను నియమించుకున్నందున ఆ సొమ్మును చెల్లించలేమని ప్రభుత్వం చెబుతోందన్నారు. అనంతరం... ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... స్థానిక సంస్థల ఎన్నికల కోసం రూ.117 కోట్లు కేటాయించామన్నారు.

న్యాయవాదుల ఫీజుల బిల్లులపై న్యాయమూర్తి ఆశ్చర్యం

ఈ సందర్భంగా న్యాయవాదులకు ఫీజుల రూపంలో ఎస్‌ఈసీ చెల్లించిన, చెల్లించాల్సిన బిల్లులను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. వాటిని లెక్కిస్తే కోట్ల రూపాయలు తేలేట్లు ఉందన్నారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న సొమ్మును ఇలా ఖర్చు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. ఎస్‌ఈసీ అధికార నివాసం విజయవాడలో ఒకటి, హైదరాబాద్‌లో మరొకటి ఉండాల్సిన అవసరం ఏముందన్నారు.

ఇదీచదవండి

ప్రజల ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహం : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.