తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(MLA guvvala balaraj)కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి తమతో అమర్యాదగా ప్రవర్తించడం సరికాదంటూ పోలీసులు నచ్చ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులతో ఎమ్మెల్యే బాలరాజు(MLA guvvala balaraj) ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఆయన తీరు ఏం బాగాలేదంటు విమర్శిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Telangana tourism minister Srinivas goud) తల్లి శాంతమ్మ దశదినదర్మకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరయ్యారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని బూత్పూర్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వెళ్లిన బాలరాజు తన వాహనంలో.. సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గం గుండా రావడం చూసి పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని పార్కింగ్‌లో ఆపి వెళ్లాలని కోరారు. ఈ క్రమంలో తనను అడ్డుకున్న పోలీసులపై బాలరాజు మండిపడ్డారు. అక్కడే ఉన్న కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు.. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి పోలీసులతో అలా మాట్లాడటం సరికాదని చెప్పారు. పోలీసులకు.. ఎమ్మెల్యేకు డీఎస్పీ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి:
4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి