తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. విషం కలిసిన టీ తాగి మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎండ్రిన్ గుళికలను టీ పొడిగా భావించి అంజమ్మ టీలో వేసింది. గుళికల మందు కలిసిన టీని అంజమ్మ తాగి మృతి చెందింది. అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చూడండి. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య