ETV Bharat / city

ap topnews ప్రధానవార్తలు9am

.

ap topnews
ప్రధానవార్తలు9am
author img

By

Published : Aug 26, 2022, 9:04 AM IST

  • పని చేయకుంటే పక్కన పెడతామన్న చంద్రబాబు

పార్టీ కోసం పని చేసేవారికే అధిక ప్రాధాన్యం ఇస్తామని, లేకుంటే పక్కన పెడతానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కార్యకర్తలకు తేల్చి చెప్పారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని కుప్పం వేదికగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైకాపా శ్రేణుల దాడిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన ఆయన పోలీసులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

  • లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కి భూములిచ్చి అటు సాగుకు, ఇటు ఉపాధికి దూరమైన రైతులు

అసలే వెనకబడిన ప్రాంతం. ఉపాధి అవకాశాలేవీ లేని దైన్యం. పంట పండితేనే పూట గడిచే పరిస్థితి. అలాంటి పేద రైతులను నమ్మించి అప్పటి ప్రభుత్వ పెద్దలు పరిశ్రమలు, ఉపాధి పేరు చెప్పి వేల ఎకరాలు సేకరించారు. పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆశ చూపారు. పదిహేనేళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమా రాలేదు. ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. కొంతమందికి పరిహారమైనా అందలేదు.

  • గిరి యువతకు ఆశాకిరణం హోం నర్సింగ్‌ శిక్షణ

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు రాక చాలామంది యువత ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులతో ఆధైర్య పడుతున్నారు. గిరిజన యువత పరిస్థితి మరింత సంక్లిష్టం. కొలువులు కోసం ప్రయత్నాలు చేసిచేసి అలసి కూలీ బాట పడుతున్న వారు ఎందరో. అల్లూరి జిల్లా మన్యంలో పోలీసు వారి సహకారంతో ఉపాధి మార్గం వైపు ముందడుగు వేస్తున్న గిరిజన యువత కథ మాత్రం అందుకు కొంచెం భిన్నం.

  • ప్రైవేటు బస్సులో భారీ చోరీ, రూ.25 లక్షలు అపహరణ

చిలకలూరిపేట-మార్టూరు మధ్య ఓ ప్రైవేటు బస్సులో భారీ చోరీ జరిగింది. ఆంజనేయులు అనే ప్రయాణికుడికి చెందిన రూ.25 లక్షలను దుండగులు చోరీ చేశారు. మార్టూరు వద్ద బాధితుడు టిఫిన్‌ కోసం బస్సులోంచి దిగాడు. ఆ సమయంలో నగదు ఉన్న బ్యాగును దుండగులు ఎత్తుకెళ్లారు.

  • ఘోర అగ్నిప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం

ఉత్తర్​ప్రదేశ్​లోని మొరాదాబాద్​ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల లోపల ఉన్న ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

  • కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక ఇప్పట్లో లేనట్లే, కారణం ఇదే

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక కొద్ది వారాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 'భారత్‌ జోడో యాత్ర'పై పార్టీ దృష్టి పెట్టడంతో పాటు, కొన్ని రాష్ట్రాల పార్టీ విభాగాలు అవసరమైన ప్రక్రియను ఇంకా పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఆదివారం.. పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ సమావేశం కానుంది.

  • అప్పుల ఊబిలో చిక్కుకున్నారా, ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టమే

అడగకుండానే అప్పు ఇస్తామంటూ ఫోన్లు, వడ్డీ లేని వాయిదాలు, ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అంటూ ఆఫర్లు, అవసరం లేకున్నా రుణాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు. ఒక్కసారి ఈ వలలో పడ్డామా, ఇక అంతే సంగతులు. రూపాయికి పది రూపాయలు చెల్లిస్తేగానీ బయటపడలేని పరిస్థితి. ఈ దారుణాలకు భయపడి ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం

  • రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు, మొట్టమొదటిసారి ఆ మీటింగ్​లో

మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్‌ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్‌కూ భారత్‌ గైర్హాజరైంది. అది అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం రుచించలేదు.

  • ఈ టీమ్​ఇండియా బౌలర్లు ఎలా ఆడతారో

బుమ్రా లేడు.. షమికి చోటు లేదు. యువ పేసర్లు అర్ష్‌దీప్‌, అవేష్‌ ఖాన్‌ ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేంట్ర చేశారు. పెద్దగా అనుభవం లేని పేస్‌ బౌలింగ్‌ దళాన్ని ఆసియాకప్‌లో నడిపించే బాధ్యత ఇప్పుడు జట్టులో ఏకైక సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ అయిన భువీదే. స్పిన్‌ విభాగం పటిష్ఠంగానే ఉన్నా.. ఫాస్ట్‌బౌలింగ్‌ మాత్రం కలవరపెడుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు కళ్లెం వేసి టైటిల్‌ నెగ్గాలనుకుంటున్న భారత్‌కు ఈ పేసర్ల ప్రదర్శన చాలా కీలకం.

  • విజయ్​దేవరకొండ లైగర్​ ఫస్ట్ డే కలెక్షన్స్​ ఎంతంటే

రౌడీహీరో విజయ్​దేవరకొండ నటించిన తాజా చిత్రం 'లైగర్'​. భారీ అంచనాలతో గురువారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయింది. అలాగే కలెక్షన్స్​ పరంగా కూడా నిరాశపరిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 13.35కోట్ల షేర్​, 24.5కోట్ల గ్రాస్​ అందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.