ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

.

7PM TOP NEWS
ప్రధానవార్తలు @7PM
author img

By

Published : Sep 18, 2020, 7:07 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు, 67 మరణాలు
    రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 74వేల 710 మందికి పరీక్షలు చేయగా... 8వేల 96 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 9వేల 558కి చేరింది. కొవిడ్‌ బీభత్సానికి మరో 67 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5 వేల 244కి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 16 నెలల వైకాపా అవినీతి పాలనపై సీబీఐ విచారణ జరపాలి
    వైకాపా పాలనలో మనుషులకే కాదు.. దేవుళ్లకు కూడా రక్షణ లేదని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఆలయాలపై ఇన్ని దాడులు ఏ ప్రభుత్వం హయాంలోనూ జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై వరుస దాడులతో.. వైకాపా 16 నెలల పాలనలో 16 శాతం ఓటింగ్​కు దూరమైందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌
    పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. లీటర్‌పై రూపాయి, వ్యాట్‌కు అదనంగా 2 ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధించారు. ఈ మొత్తాన్ని డీలర్ నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 23న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
    తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వివరాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నెల 23వ తేదీన సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. 24వ తేదీన కర్ణాటక సీఎంతో కలిసి సీఎం జగన్ శ్రీవారి సేవలో పాల్గొంటారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'లవ్ జిహాద్​'పై యోగి ఆర్డినెన్స్​ అస్త్రం!
    ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి నివారణకు కొత్త ఆర్డినెన్సు తెచ్చే అవకాశాలు పరిశీలించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీం ఓకే
    అత్యవసర సేవలు సహా దిల్లీ పోలీసులు వినియోగించేందుకు ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఫాడా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 1 నుంచి బీఎస్​-6 వాహనాలనే విక్రయించాలని గతంలోనే స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టిక్​టాక్​కు ఎదురుదెబ్బ.. అమెరికాలోనూ బ్యాన్​
    అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ అన్నంతపనీ చేశారు. టిక్​టాక్​, వుయ్​చాట్​పై వేటు వేస్తూ.. ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఇకపై అమెరికాలో ఈ యాప్​లు డౌన్​లోడ్​ చేసుకొనేందుకు వీలవదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి పేటీఎం ఔట్​..​
    ప్రముఖ డిజిటల్​ పేమెంట్స్​ సంస్థ పేటీఎంను తమ 'ప్లే స్టోర్'​ నుంచి తొలగించింది గూగుల్​. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్​ గేమ్స్​ను కూడా తీసివేసింది. గ్యాబ్లింగ్​ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ వేటు వేసినట్లు స్పష్టం చేసింది గూగుల్​ సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్: ఈసారి లీగ్ చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
    ఐపీఎల్.. ప్రపంచ క్రికెట్​లో అత్యంత ధనిక లీగ్​గా పేరు తెచ్చుకుంది. అయితే ఈసారి కరోనా వల్ల సరికొత్తగా ఉండనుంది. విదేశాల్లో టోర్నీ నిర్వహణ, ఖాళీ మైదానాల్లో మ్యాచ్​లు, బయోబబుల్ వాతావరణం లాంటి వినూత్న అంశాలు ఉన్నాయి. వాటి గురించే ఈ ప్రత్యేక కథనం కోసం క్లిక్​ చేయండి..
  • ఎన్​సీబీ విచారణకు దర్శక నిర్మాత కరణ్ జోహార్?
    మాదక ద్రవ్యాల కేసులో భాగంగా ఎన్​సీబీ విచారణకు కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం ఇతడితో పాటే మరో ఏడుగురు బాలీవుడ్ సెలబ్రిటీలపై ఓ న్యాయవాది కేసు పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.