ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 7895 కరోనా కేసులు...93 మరణాలు - కరోనా వైరస్ వార్తలు

corona-positive-cases
corona-positive-cases
author img

By

Published : Aug 23, 2020, 4:58 PM IST

Updated : Aug 23, 2020, 5:21 PM IST

16:56 August 23

రాష్ట్రంలో కొత్తగా 7895 కరోనా కేసులు...93 మరణాలు

corona-positive-cases
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 46,712 నమూనాలను పరీక్షించగా వారిలో 7,895  మందికి వైరస్‌ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు నమోదు చేసిన వివరాలను అందులో పేర్కొంది. ఒక్కరోజులోనే  రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 93 మంది మృతి చెందారు.

చిత్తూరులో 11, అనంతపురం 3, నెల్లూరు 16, తూర్పుగోదావరి 4, కడప 8, కర్నూలు 10, గుంటూరు 3, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 6, కృష్ణా 3, విజయనగరంలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 3,282కి చేరింది. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,38 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి

కాంగ్రెస్​లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!

Last Updated : Aug 23, 2020, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.