ETV Bharat / city

విహారయాత్ర అంటే వీరిదే.. ఒకే ఇంటిపేరు గల 123 మంది ఒకేసారి.. - బండారు ఇంటిపేరు గల 123 మంది తిరుపతికి వెళ్లారు

సాధారణంగా ఎవరైనా విహారయాత్రలు, దైవ దర్శనాలకు వెళితే.. ఒకే కుటుంబానికి చెందినవారు లేదా 10 లేదా 20 మంది కలిసి బయలుదేరుతారు. అలాగే ఇక్కడ దైవదర్శనం కోసం ఒకే ఇంటి పేరు గల 123 మంది తిరుపతి వెళ్లారు. దర్శన క్యూలైన్​లో చాంతాడంతా దూరం వారే.. అలాగే బయట దుకాణాల వద్ద వారిని చూసి షాపు యాజమానులు తికమకపడ్డారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి. ఎందుకో మీరే చూడండి.

123 PEPOLE TIRUPATI TOUR
123 PEPOLE TIRUPATI TOUR
author img

By

Published : Oct 15, 2022, 10:56 PM IST

123 PEPOLE TIRUPATI TOUR : మనం ఏదైనా విహారయాత్రకు వెళ్తే మామూలుగా అయితే కుటుంబంతో.. మహా అయితే 20 నుంచి 30 మంది కలిసి వెళతాం. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒకే ఇంటి పేరు 123 మంది తిరుపతి దైవ దర్శనానికి వెళ్లారు. వారి యాత్రకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో ఒకే ఇంటి పేరు గల వారంతా ఓ ట్రిప్ ప్లాన్ చేశారు. దైవ దర్శనం కోసం తిరుపతికి వెళ్దామనుకున్నారు. దాంతో బండారు బ్రదర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బండారు ఇంటి పేరుతో గల 123 మంది కలిసి తిరుమల యాత్రకు తరలివెళ్లారు. ఒకే ఇంటి పేరుతో 123 మంది తిరుపతికి బయలుదేరడంతో వారి హంగామా మామూలుగా లేదు. ఎక్కడ చూసినా వీరి సందడే కనబడింది.

విహారయాత్ర అంటే వీరిదే.. ఒకే ఇంటిపేరు గల 123 మంది ఒకేసారి..

దర్శన క్యూలైన్​లో చాలా దూరం వరకు బండారు ఫ్యామిలీ వారే ఉండడంతో వారంతా ఆనందంతో ఉత్సాహంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం షాపింగ్​ కోసం దుకాణాల వద్దకు వెళ్లిన వీరిని చూసి షాపు యాజమానులే కొద్దిసేపు తికమకపడ్డారు. ఏదైతేనేం ఈ అసోసియేషన్ సభ్యులంతా దైవదర్శనం అనంతరం తామంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు. ఒకే ఇంటి పేరుతో దర్శనానికి వెళ్లిన వారి దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.