ETV Bharat / business

రికార్డు స్థాయికి టోకు ద్రవ్యోల్బణం.. ఏప్రిల్​లో 15.08% - wholesale price index inflation

WPI Inflation: దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. ఏప్రిల్​లో అత్యధికంగా 15.08శాతంగా నమోదైంది. ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

WPI inflation
wpi inflation rate
author img

By

Published : May 17, 2022, 12:51 PM IST

Updated : May 17, 2022, 1:24 PM IST

WPI Inflation: ఇంధనం, ఆహారం, ఇతర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్​లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) అత్యధికంగా 15.08 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 14.55 శాతంగా ఉండగా, గతేడాది ఏప్రిల్​లో 10.74శాతంగా నమోదైంది. మినరల్ ఆయిల్స్​, బేసిక్ మెటల్స్​, క్రూడ్ పెట్రోలియం, నేచురల్, ఫుడ్​ ఆర్టికల్స్​, నాన్​ ఫుడ్​ ఆర్టికల్స్​, ఆహార ఉత్పత్తులు, కెమికల్స్​, కెమికల్ ప్రొడక్ట్స్​ ధరలు పెరగడమే ద్రవ్యోల్బణ ఎగబాకడానికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

  • గతేడాది ఏప్రిల్​ నుంచి వరుసగా 13వ నెలలోనూ డబ్ల్యూపీఐ రెండంకెల స్థాయిలో కొనసాగుతోంది.
  • ఏడాది కాలంగా కూరగాయలు, గోధుమ, పండ్లు, ఆలుగడ్డల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం 8.35శాతంగా ఉంది
  • ఇంధనం, విద్యుత్​ రంగాల్లో ద్రవ్యోల్బణం 38.66 శాతంగా, ఉత్పత్తి వస్తువుల్లో 10.85శాతం, నూనె గింజల్లో 16.10 శాతంగా ఉంది.
  • ముడి చమురు, సహజ వాయువు విభాగంలో ఏప్రిల్​ నెలలో ద్రవ్యోల్బణం 69.07గా నమోదైంది.
  • ఏప్రిల్​లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరుకొని 7.79శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం గతవారం లెక్కలు విడుదల చేసింది. ఇది వరుసగా నాలుగో నెలలో రిజర్వ్​ బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యం కంటే ఎక్కువగా నమోదైంది.
  • అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఈ నెలారంభంలో అనూహ్యంగా కీలక వడ్డీ రేట్లను 0.40శాతం, సీఆర్​ఆర్​ను 0.50శాతం పెంచింది ఆర్​బీఐ.

ఇదీ చూడండి: దడ పుట్టిస్తున్న ధరలు.. 8ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం!

Last Updated : May 17, 2022, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.