ETV Bharat / business

క్రెడిట్​ స్కోర్​ తగ్గిపోయిందా.. వీటిని ఓసారి చెక్​ చేసుకుంటే సరి.. వెంటనే లోన్​! - క్రెడిట్​ స్కోర్​

Credit Score: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు​ వాడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. అయితే క్రెడిట్​ కార్డు యూజర్ ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాడో క్రెడిట్​ స్కోర్​ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు క్రెడిట్​ స్కోర్​ తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో ఓ సారి వీటిని చెక్​ చేసి సరిచేసుకుంటే మళ్లీ స్కోరు గాడిన పడుతుంది.

credit score
credit score
author img

By

Published : Jul 9, 2022, 4:08 PM IST

Credit Score:ఒక వ్యక్తి ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణతో ఉన్నారో క్రెడిట్‌ స్కోరు వెల్లడిస్తుంది. కావాల్సినప్పుడు వెంటనే రుణాలు పొందాలంటే ఈ స్కోరు మీకు ఒక అస్త్రంగా పనిచేస్తుంది. కీలకమైన ఈ క్రెడిట్‌ స్కోరు కొన్నిసార్లు తగ్గిపోతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఏయే సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉంది? ఇలాంటప్పుడు ఏం చేయాలి?

క్రెడిట్‌ స్కోరు తగ్గిపోయిందని గుర్తించిన వెంటనే నివేదికను ఒకసారి పరిశీలించండి. కొత్తగా మీకు తెలియకుండా ఏదైనా అప్పు మీ ఖాతాలో చేరిందా చూసుకోండి. తీసుకున్న రుణాలకు వాయిదాల చెల్లింపు ఆలస్యమయ్యిందా? క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం చెల్లించారా చూసుకోండి. కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాలతో క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నివేదికను జాగ్రత్తగా గమనిస్తే.. కారణాలేమిటో తెలుసుకోవచ్చు. వాటిని సరిచేసుకోవడం ద్వారా మళ్లీ స్కోరు గాడిన పడేలా చూసుకోవచ్చు.

వాయిదాలు ఆలస్యం
సాధారణంగా ఈఎంఐలను ఆలస్యంగా చెల్లించినా.. లేదా చాలా కాలంగా వాటిని పట్టించుకోకపోయినా.. క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. ఒకసారి ఈఐఎంని సకాలంలో చెల్లించకపోతే.. తర్వాత దీనిని క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా స్కోరును సరిచేసుకోవచ్చు. ఎప్పుడూ ఆలస్యం చేస్తుంటే.. స్కోరును పెంచుకోవడం కుదరని పని. సమయానికి చెల్లించడం అనేది మీ చేతిలో పనే. దీన్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.

పరిమితిలోపే..
క్రెడిట్‌ కార్డులను ఎప్పుడూ పరిమితిలోపే వినియోగించాలి. అంతేకాదు.. కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడితే.. మీరు మొత్తం రుణాలపైనే ఆధారపడుతున్నారని బ్యాంకులు అర్థం చేసుకుంటాయి. కాబట్టి, మీ క్రెడిట్‌ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడొద్దు. 90 శాతం వాడితే.. స్కోరుపై ప్రభావం ఉంటుంది. ఒకవేళ మీ స్కోరు క్రెడిట్‌ కార్డును అధికంగా వాడటం వల్ల తగ్గిందని భావిస్తే.. వెంటనే కార్డు వినియోగ నిష్పత్తిని 30 శాతం లోపు ఉండేలా చూడండి. క్రమంగా స్కోరు బాగుపడుతుంది.

అప్పు కోసం అడిగితే..
అప్పుల సంఖ్య అధికంగా ఉంటే.. క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది. చాలామంది అప్పు మొత్తం తక్కువగానే ఉన్నా.. వాటి సంఖ్య మాత్రం అధికంగా ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడూ ఏదో ఒక బ్యాంకు, యాప్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల్లో రుణాల కోసం చూస్తూ ఉంటారు. ఇలాంటి వారి రుణ నివేదికలో ఆ అంశాలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న రుణాలను తీర్చేసి, ఒక పెద్ద అప్పును ఉంచుకోవడం ఎప్పుడూ మంచిది. అనవసరంగా రుణాలు కావాలని ఎవరినీ సంప్రదించకూడదు.

  • చాలా ఏళ్లుగా వాడుతున్న క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకున్నప్పుడు తాత్కాలికంగా స్కోరుపై ప్రభావం పడుతుంది. మీ రుణ అర్హత తగ్గిపోవడం, రుణ చరిత్రలో పాత కార్డుకు సంబంధించిన వివరాలు లేకపోవడం ఇందుకు కారణం అవుతుంది. కాబట్టి, మీరు తొలిసారి తీసుకున్న క్రెడిట్‌ కార్డును సాధ్యమైనంత వరకూ రద్దు చేసుకోవద్దు.
  • పాన్‌, ఆధార్‌ కార్డులను దొంగతనంగా వాడుకొని, రుణాలు తీసుకుంటున్న సైబర్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసం ఏమైనా జరిగిందా అని తెలుసుకోవాలంటే.. క్రెడిట్‌ నివేదికను తరచూ పరిశీలిస్తుండాలి. మీకు సంబంధం లేని అప్పులు కనిపిస్తే వెంటనే బ్యాంకులు/రుణ సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడు క్రెడిట్‌ బ్యూరోలు వాటిని సరిదిద్దుతాయి. ఫలితంగా స్కోరు మెరుగవుతుంది.

ఇవీ చదవండి: టెలికాం రంగంలోకి అదానీ.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి దరఖాస్తు!

ట్విట్టర్​ డీల్ నుంచి ఎలాన్ మస్క్ ఔట్.. కోర్టుకు వెళ్తామన్న సంస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.