ETV Bharat / business

అక్టోబర్​లో దుమ్మురేపిన కార్ల అమ్మకాలు.. బైక్​ సేల్స్ డౌన్​! - car sales in market 2022

పండుగ సీజన్​లో కార్ల అమ్మకం జోరుగా సాగింది. మధ్యస్థాయి కార్లతో స్పోర్ట్స్​ కార్లకు మరింత డిమాండ్​ పెరిగింది. అయితే ద్విచక్ర వాహనాల డిమాండ్​ మాత్రం కొంత మేరకు తగ్గిందని తయారీ సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

cars and bikes sales in october statistics

author img

By

Published : Nov 2, 2022, 7:13 AM IST

Vehicle Sales October 2022 : పండగల నేపథ్యంలో, అక్టోబరులో కార్ల విక్రయాలు దుమ్ము రేపాయి. మధ్య స్థాయి కార్లతో పాటు స్పోర్ట్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీ)కు అమిత గిరాకీ లభించాయి. ప్రారంభ స్థాయి కార్ల అమ్మకాలూ పెరిగాయి. ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉందని తయారీ సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

  • దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,67,520 వాహనాలు విక్రయించింది. 2021 అక్టోబరు నాటి 1,38,335 విక్రయాలతో పోలిస్తే ఇవి 21% అధికం. ఇందులో దేశీయ విక్రయాలు 1,17,013 నుంచి 26 శాతం వృద్ధితో 1,47072కు చేరాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్‌-ప్రెసోల విక్రయాలు 21,831 నుంచి 24,936కు పెరిగాయి.
  • కాంపాక్ట్‌ కార్లలో బాలెనో, సెలెరియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, టూర్‌ ఎస్‌, వ్యాగన్‌ఆర్‌ల విక్రయాలు 48,690 నుంచి 73,685కు చేరాయి. యుటిలిటీ వాహనాలైన బ్రెజా, ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, ఎక్స్‌ఎల్‌6ల విక్రయాలు 27,081 నుంచి 30,971కి పెరిగాయి.
  • ఈకో విక్రయాలు 10,320 నుంచి 8,861కు తగ్గాయి. తేలికపాటి వాణిజ్య వాహనం సూపర్‌ క్యారీ విక్రయాలు 3,797 నుంచి 2,913కు పరిమితమయ్యాయి. ఎగుమతులు 21,322 నుంచి 20,448కి తగ్గాయి.
  • టాటా మోటార్స్‌ మొత్తం విక్రయాలు 67,829 నుంచి 15.5 శాతం పెరిగి 78,335కు చేరాయి. విద్యుత్‌ వాహన విక్రయాలు 1,660 నుంచి 4,277కు చేరగా, వాణిజ్య వాహన అమ్మకాలు దేశీయ విపణిలో 31,226 నుంచి స్వల్పంగా పెరిగి 31,320గా నమోదయ్యాయి.
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు 20,130 నుంచి 60 శాతం పెరిగి 32,298కు చేరాయి. ట్రాక్టర్ల విక్రయాలు 47,017 నుంచి 11 శాతం పెరిగి 51,994కు చేరాయి. సంస్థ 20,980 వాణిజ్య వాహనాలను విక్రయించింది.
  • ద్విచక్ర వాహన విక్రయాల్లో హీరో మోటోకార్ప్‌ టోకు విక్రయాలు 17 శాతం, బజాజ్‌ ఆటో విక్రయాలు 10 శాతం క్షీణతను నమోదు చేశాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విక్రయాలు 44,133 నుంచి 86 శాతం పెరిగి 82,235 కు చేరాయి.
  • అక్టోబరులో వాహన సంస్థల టోకు విక్రయాలు

8 లక్షల వాహనాల పెండింగ్‌
డీలర్ల నుంచి ఆర్డర్లు లభించినా, కంపెనీలు ఇంకా 8 లక్షల మేర వాహనాలను సరఫరా చేయలేదు. ఇందులో మారుతీ సుజుకీయే 3.9 లక్షల వాహనాలను అందించాల్సి ఉంది.

  • ఏప్రిల్‌-అక్టోబరులో మొత్తం 22.74 లక్షల ప్రయాణికుల వాహనాలు (పీఈ) విక్రయమయ్యాయి. 2021 ఇదే కాలం నాటి 16.48 లక్షల వాహనాలతో పోలిస్తే, ఈసారి 22.74 శాతం పెరిగాయి.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 38 లక్షల పీవీలు విక్రయమవుతాయనే అంచనాను పరిశ్రమ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
    cars and bikes sales in october statistics
    .

ఇదీ చదవండి: 'స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' జంషెడ్​ జె ఇరానీ కన్నుమూత..

గుడ్​న్యూస్.. బ్యాంకులో SO పోస్టులకు IBPS నోటిఫికేషన్.. పూర్తి​ వివరాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.