Upcoming Electric Cars Under 15 Lakh : ఆటోమొబైల్ రంగం భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఆధారపడి ఉంది. అందుకే ప్రముఖ కారు తయారీ కంపెనీలు అన్నీ తమ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అందులో రూ.15 లక్షల బడ్జెట్లో వస్తున్న టాప్ మోడల్ కార్ల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన టాటా, హ్యుందాయ్, కియా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఎమ్జీ.. 2025 సంవత్సరం నాటికి దాదాపు రూ.15 లక్షల బడ్జెట్లో తమ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాయి.
Tata Punch EV Launch Date :
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. త్వరలోనా టాటా పంచ్ ఈవీ కారును మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తక్కువ బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కారు పలుమార్లు ఇండియన్ రోడ్లపై కనిపించింది. ఇది జెన్-2 సిగ్మా ఆర్కిటెక్చర్‌తో, ఈవీ స్పెసిఫిక్ ICE పంచ్ డిజైన్‌తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుందని సమాచారం.
నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీ కార్లలో ఉపయోగించిన జిప్ట్రోన్ టెక్నాలజీనే ఈ టాటా పంచ్ ఈవీలోనూ ఉపయోగించారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ టాటా పంచ్ ఈవీ కారుకు పోటీ లేదు. హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ విడుదలైతే ఈ రెండింటి మధ్య మంచి పోటీ ఏర్పడుతుంది.
Hyundai Exter EV Launch Date :
కొన్ని వారాల క్రితం ఇంటర్నెట్లో.. హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ కారు మోడల్ కనిపించింది. ఈ మైక్రో-ఈ ఎస్యూవీ కారు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ కారు కనుక లాంఛ్ అయితే టాటా పంచ్ ఈవీతో నేరుగా పోటీ ఏర్పడనుంది. బహుశా దీనిని రానున్న ఒకటి లేదా రెండేళ్లలో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
Kia AY EV Launch Date :
కియా కంపెనీ తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని Kia AY అనే కోడ్ నేమ్‌తో పిలుస్తోంది. ఈ ఎస్యూవీ కారును బహుశా 2025 లేదా 2026లో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారు ICE, EV వేరియంట్లలో అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కార్ రగ్గడ్ లుక్‌లో అదిరిపోతోంది.
Skoda EV Launch Date :
స్కోడా కంపెనీ 4మీటర్లు పొడవైన SUV ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తోంది. దీని ధర బహుశా రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇంజినీరింగ్ టెక్నాలజీతో దీనిని రూపొందిస్తున్నట్లు సమాచారం.
MG Compact Electric SUV Launch Date :
ఎంజీ మోటార్స్ కంపెనీ కామెట్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను రూపొందిస్తోంది. దీనిని బహుశా 2025లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇది నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ కార్లతో పోటీ పడనుంది.