2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం.. మహిళల కోసం కొత్త పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాలను ప్రకటించారు.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్..
- ఇది కొత్త పథకం
- మహిళలకు, బాలికలకు సంబంధించినది
- డిపాజిట్లపై రెండేళ్ల పాటు 7.5 శాతం స్థిర వడ్డీ లభిస్తుంది
- మహిళలు, బాలికల పేరుపై ఖాతాను తెరవాల్సి ఉంటుంది
- గరిష్ఠంగా రెండు లక్షల వరకు ఖాతాలో జమ చేసుకోవచ్చు
- ఖాతాలో కొంత సొమ్మును విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుంది
మహిళా సమ్మాన్ సేవింగ్ పత్ర
- ఇది వన్-టైమ్ కొత్త చిన్న పొదుపు పథకం
- రెండేళ్ల కాల పరిమితితో ఉంటుంది
- మహిళలు, బాలికలకు డిపాజిట్ సౌకర్యం ఉంటుంది
- డిపాజిట్లపై రెండేళ్ల పాటు 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ బచత్ పాత్ర పథకం
- ఇది కొత్త పథకం
- వన్-టైమ్ చిన్న పొదుపు పథకం
పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్న రైతులకు రూ.2.25 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించనట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకం కింద మూడు కోట్ల మంది మహిళా రైతులకు రూ.54,000 కోట్లు అందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇవే కాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేయడం కోసం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద.. 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో తెలిపారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పథకంలో సైతం పలు మార్పులు ప్రకటించారు నిర్మల సీతారామన్. ఈ పథకంలో డిపాజిట్ల పరిమితిని రెట్టింపు చేశారు. రూ. 15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. పోస్టల్ నెలవారీ ఆదాయ ఖాతా పథకంలోనూ సేవింగ్స్‌ను రెట్టింపు చేశారు. సేవింగ్స్ పరిమితిని రూ.4.5 నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ ఖాతా డిపాజిట్లను రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.