Top 5 Best Selling Smart Watches in Amazon Sale : ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండగ సీజన్ హడావుడి మొదలయింది. ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో ఇ- కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్ ప్రారంభించాయి. ఈ సమయంలో చాలా మంది ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పాటు స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లనూ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023(Amazon Great Indian Festival sale 2023)ను ఈ నెల 8న ప్రారంభించింది.
Amazon Great Indian Festival 2023 Offers : అందులో భాగంగా వివిధ రకాల వస్తువులపై రాయితీలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేసేవారికి అమెజాన్ 10 శాతం రాయితీ కూడా ఇస్తోంది. షావోమి, వన్‌ప్లస్ వంటి సంస్థలు కూడా అదనపు ఆఫర్లను ఇస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా పలు కంపెనీల స్మార్ట్‌వాచ్‌ల(Smart Watches)పై భారీ రాయితీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువ అమ్ముడుపోతున్న టాప్ 5 స్మార్ట్‌వాచ్‌లను మీకు తెలియజేస్తున్నాం. అవేంటో తెలుసుకుని మీరు ఓ వాచ్‌కి ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 బ్లూటూత్ (Samsung Galaxy Watch 4) : అమెజాన్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు 40mm, 44mm సైజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 44mm శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 బ్లూటూత్ వేరియంట్ అన్ని ఆఫర్లతో కలిపి ప్రస్తుతం రూ.7,999కు లభిస్తోంది. ఈ వాచ్ రూ.26,999 వద్ద మార్కెట్లోకి ప్రవేశించింది. మార్కెట్ ధరతో పోలిస్తే ప్రస్తుతం ఈ వాచ్ 70 శాతం డిస్కౌంట్‌పై అమెజాన్ సేల్‌లో లభిస్తోంది. ఇటీవలే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌కు వేర్ ఓఎస్ 4- ఆధారిత వన్ యూఐ 5 అప్డేట్ను అందించింది. ఈ స్మార్ట్ వాచ్‌లు ఎగ్జినోస్ W920 ప్రాసెసర్, 1.5జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్‌తో వస్తున్నాయి.
అమేజ్‌ఫిట్ జీటీఎస్ 4 మినీ వాచ్ (Amazfit GTS 4 Mini) : 2022 జులైలో విడుదలైన అమేజ్‌ఫిట్ జీటీఎస్ 4 మినీ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో రూ.7,999కే లభిస్తోంది. మార్కెట్లో దీని ఒరిజినల్ ధర రూ.10,999. 1.65 అంగుళాల డిస్ప్లేతో వస్తోన్న ఈ వాచ్‌లో బిల్ట్-ఇన్ అలెక్సా ఫీచర్ ఉంది. అలాగే 120 స్పోర్ట్స్ మోడ్లతో పాటు ఫిట్నెస్ ట్రాకర్ కూడా ఇందులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ (OnePlus Nord Watch) : ప్రస్తుత పండగ సీజన్లో వన్‌ప్లస్ కంపెనీ తమ ఉత్పత్తులపై మంచి ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌పై 40% ప్రకటించింది. ప్రస్తుతం ఇది రూ.3,999కే లభిస్తోంది. రూ.6,999 ధర వద్ద ఈ వాచ్ మార్కెట్లోకి వచ్చింది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న ఈ వాచ్‌లో 105 ఫిట్నెస్ మోడ్లు ఉన్నాయి. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ తెలిపింది.
అమేజ్‌ఫిట్ పాప్ 3ఎస్ స్మార్ట్‌వాచ్ (Amazfit Pop 3S Smartwatch) : అమేజ్‌ఫిట్ పాప్ 3ఎస్ స్మార్ట్‌వాచ్ అమెజాన్ తాజా సేల్‌లో రూ.2,999కే లభిస్తోంది. సాధారణ సమయంలో ఈ వాచ్ ధర రూ.3,499గా ఉంటుంది. 1.96 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. ఇందులో ఏఐ వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. 12 రోజుల వరకు దీని బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అదే విధంగా 100 వాచ్ ఫేస్‌లు, 100 స్పోర్ట్స్ మోడ్లు ఈ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి.
బోట్ ఎక్స్టెండ్ ప్లస్ స్మార్ట్‌వాచ్ (boAt Xtend Plus Smartwatch) : తాజా అమెజాన్ సేల్‌లో ఎక్స్టెండ్ ప్లస్ స్మార్ట్‌వాచ్‌ను బోట్ రూ.1,998కే అందిస్తోంది. మార్కెట్లో దీని లాంఛ్ ధర రూ.9,499గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే ఇందులో అనేక ఆరోగ్య శ్రేణి ఫీచర్లు ఉన్నాయి. 100 స్పోర్ట్స్ మోడ్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. దీనిని ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. ఏడు రోజుల వరకు వస్తుందని కంపెనీ తెలిపింది.