ETV Bharat / business

వాహనదారులకు బ్యాడ్ న్యూస్​.. థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం పెంపు

author img

By

Published : May 26, 2022, 11:53 AM IST

third party insurance: థర్డ్​ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది.

third party insurance
third party insurance

third party insurance: వాహనదారులకు షాక్​ ఇచ్చింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. థర్డ్​ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్​ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది.

కొవిడ్​ కాలంలో మారటోరియం విధించిన కేంద్రం.. రెండేళ్ల అనంతరం తిరిగి జూన్​ 1న అమలు చేయనుంది. అంతకుముందు బీమా నియంత్రణ ప్రాధికార, అభివృద్ధి సంస్థ వీటిని నిర్ణయిస్తుండగా.. ఆ సంస్థ సహకారంతో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం వీటిని సవరించింది. కాగా హైబ్రిడ్​ ఎలక్ట్రిక్​ వాహనాలకు ప్రీమియంలో 7.5 శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • 1000సీసీ గల ప్రైవేట్​ కార్లకు గతంలో రూ. 2,072 ఉండగా.. ప్రస్తుతం రూ. 2,094కు పెంచింది.
  • 1000సీసీ నుంచి 1500సీసీ ప్రైవేట్​ కార్లకు రూ. 3,221 ఉండగా.. ఇప్పుడు రూ.3,416 కానుంది.
  • 1500సీసీ పైబడిన సొంత కార్ల ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కి తగ్గింది.
  • 150సీసీ ద్విచక్రవాహనాలకు రూ.1,366గా, 350 సీసీ వాహనాలకు రూ.2,804 గా నిర్ణయించింది.
  • 30 కిలోవాట్​ లోపు గల ప్రైవేట్​ ఎలక్ట్రిక్​ కార్ల ప్రీమియం రూ.1,780
  • 30 నుంచి 65 కిలోవాట్​ మధ్య గల వాహనాల ప్రీమియం ఖరీదు రూ. 2,904
  • 12,000 కిలోల సరుకు రవాణా వాహనాలకు గతంలో రూ.35,313 ఉండగా ప్రస్తుతం రూ.33,414కు పెంచింది.
  • 40,000 కిలోల పైబడిన సరుకు రవాణా వాహనాలకు ప్రీమియంను రూ.41,561 నుంచి 44,242 కు పెంచింది.

ఇదీ చదవండి: గ్రెటా ఎలక్ట్రిక్‌ కొత్త విద్యుత్‌ స్కూటర్‌.. విడిగానే బ్యాటరీ, ఛార్జర్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.