These Lifestyle Changes Can Increase Wealth : అభివృద్ధి, ఆర్థికం, ఆరోగ్యం, ఆనందం.. ఇవన్నీ వీలైనంత ఎక్కువ కావాలని ప్రతి ఒక్కరూ కోరుంటారు. అయితో.. కోరికలు అందరికీ ఉంటాయి. కానీ.. వాటిని సాధించడానికి మాత్రం కొందరే ప్రయత్నం మొదలు పెడతారు. వీరిలో కొందరు మూణ్నాల్లకే వదిలేస్తారు. మరికొందరు మధ్య వరకూ వెళ్లి వెనుదిరుగుతారు. అతి కొద్ది మంది మాత్రమే చివరి వరకూ సాగుతారు. సమస్యలనే సవాలు చేసి.. సక్సెస్ శిఖరంపై నిలబడతారు. మీరు కూడా ఈ లిస్టులో ఉండాలంటే.. బండలు మోయాల్సిన పనిలేదు. కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు. జస్ట్.. మీ లైఫ్ స్టైల్లో 5 మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అవేంటో.. ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్యం : మీ వద్ద ఎంత టాలెంట్ ఉన్నా.. పనిచేయాలనే కోరిక ఉన్నా.. సక్సెస్ సాధించాలనే తపన ఉన్నా.. ఆరోగ్యంగా లేకపోతే ఏమీ చేయలేరు. అందుకే.. "హెల్త్ ఈజ్ వెల్త్" అంటారు. కాబట్టి.. ముందుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. ఇదే ఫస్ట్. ఇందుకోసం రాత్రి వేళ త్వరగా పడుకోండి. ఉదయాన్నే త్వరగా లేవండి. రోజులోని 24 గంటల్లో ఒక్క గంట వ్యాయామం కోసం కేటాయించండి. ఇది.. మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేస్తుందంటే నమ్మండి. ఉదయాన్నే వర్కవుట్స్ చేసిన తర్వాత ఫ్రెష్‌గా స్నానం చేస్తే.. మీకు కలిగే రిలీఫ్ వేరే లెవల్! దీంతో పాజిటివ్ మైండ్ సెట్ అలవాటవుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా లైన్లో పడుతుంది. మెంటల్లీ పవర్ ఫుల్‌గా మారుతారు. కెరియర్లో సరైన నిర్ణయాలు తీసుకుని సక్సెస్ వైపు పయనిస్తారు. ఉదయాన్నే లేవడానికి ఎన్ని విషయాలతో లింక్ ఉందో చూశారా? కాబట్టి.. రాత్రి త్వరగా బెడ్ ఎక్కేయండి.
ఆహారం : తర్వాత మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది మీరు తీసుకునే ఆహారం. రోడ్ల మీద దొరికే చెత్తా చెదారం తినడం ఆపేయండి. దానివల్ల పొట్ట పెరగడం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యలు, షుగర్, బీపీ వంటి ఎన్నో సమస్యలు వేధిస్తాయి. చక్కటి డైట్ పాటించండి. సాధ్యమైనంత వరకూ హెల్దీ ఆహారాన్ని తీసుకోండి. ఇంటి భోజనమే తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు డబ్బూ ఆదా అవుతుంది.
అనవసర ఖర్చులు పెరిగిపోయాయా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో డబ్బు ఆదా!
ఆలోచన : ముందుగా మీరు జీవితంలో ఏం సాధించాలని అనుకుంటున్నారో తేల్చుకోండి. దానికి ఎంత టైమ్ పడుతుందో అంచనా వేసుకోండి. దానికోసం ఈ ఏడాది ఏం చేయాలో లెక్కవేసుకోండి. లక్ష్యం అంటే మరేమీ కాదు.. ఇదే! ఈ టార్గెట్ వైపు చేసే జర్నీలో మీకు ఏవైనా టాలెంట్స్ తక్కువగా ఉంటే.. వాటిని నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఓడిపోవడం అనే భయాన్ని మనసులోంచి తీసేయండి. "పడిపోతే మళ్లీ ప్రయత్నిస్తాను.. చివరకు గెలుస్తాను.." అని దృఢంగా నిశ్చయించుకోండి. అప్పుడు మిమ్మల్ని ఓటమి భయం ఏమీ చేయలేదు. తద్వారా.. పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి.
ఆర్థికం : "ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి.." ఇది అందరికీ తెలుసు. "ఏదైనా చేస్తేనే డబ్బు వస్తుంది" ఇది అర్థం కావాలి. కాబట్టి.. మీ గోల్ వైపు ప్రయాణించడానికి ఎంత డబ్బు అవసరం అవుతుందో గుర్తించండి. దాన్ని ఎలా సంపాదించాలో కూడా ప్లాన్ చేయండి. ఇప్పటికే ఏదో పని చేస్తూ ఉన్నట్టయితే.. ఖచ్చితంగా సంపాదనలో 30 శాతం పొదుపు చేయండి. ఇలా ఎకానమీ ప్లానింగ్ తప్పనిసరి. ఈ ప్లానింగ్ లేకపోతే.. మీరు ఎంత సంపాదించినా చేతిలో నిలవదని గుర్తించండి. మీకు తెలియకుండానే వచ్చినదంతా ఖర్చయిపోతుంది.
అభివృద్ధి - ఆనందం : పైన చెప్పుకున్న నాలుగు విషయాల్లో వచ్చిన డెవలప్ మెంటే అభివృద్ధి. ఈ నాలుగు అంశాల్లో గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం ఎంత మేర డెవల్ సాధిస్తే అంత అభివృద్ధి సాధించినట్టు లెక్క. దీనివల్ల కలిగేదే ఆనందం. అభివృద్ధి ఎంత సాధిస్తూ వెళ్తే.. ఆనందం అంతగా రెట్టింపు అవుతూ ఉంటుంది. కాబట్టి.. ఈ కొత్త సంవత్సరంలో పక్కా ప్లాన్‌తో మేము చెప్పే "అ, ఆ"లను సాధన చేయండి. మీ సక్సెస్ దిశగా సాగిపోండి.
LIC నయా పాలసీ - జీవితాంతం ఆదాయం గ్యారెంటీ!
Pradhan Mantri Vaya Vandana Yojana: వృద్ధాప్యంలో ఆదాయం కోసం.. కేంద్రం పాలసీ.. మీకు తెలుసా?