ETV Bharat / business

ఎయిరేషియా ఇండియా ఇక పూర్తిగా టాటా గ్రూప్​దే - ఎయిర్​ఏషియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్

ఇప్పటికే ఎయిరేషియా ఇండియాలో టాటాకు 83.67% వాటాలున్నాయి. తాజా లావాదేవీతో మొత్తం 100 శాతం వాటా టాటాల పరమైంది. దీంతో భారత్‌ నుంచి ఎయిరేషియా పూర్తిగా వైదొలగనుంది.

airasia india tata stake
ఇక టాటా గ్రూప్​లోకి ఎయిరేషియా ఇండియా
author img

By

Published : Nov 3, 2022, 7:43 AM IST

AirAsia India Tata stake : చౌకధరల విమానయాన సంస్థ ఎయిరేషియా ఇండియా పూర్తిగా టాటా గ్రూప్‌ సంస్థగా మారనుంది. ఎయిరేషియా ఇండియాలో తమకున్న 16.33 శాతం వాటాను, టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియాకు విక్రయించడానికి షేరు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మలేషియా సంస్థ ఎయిరేషియా వెల్లడించింది. లావాదేవీకి సంబంధించిన ఆర్థిక వివరాలను ప్రకటించలేదు. ఇప్పటికే ఎయిరేషియా ఇండియాలో 83.67% వాటాలున్నందున, తాజా లావాదేవీతో మొత్తం 100 శాతం వాటా టాటాల పరమైంది. దీంతో భారత్‌ నుంచి ఎయిరేషియా పూర్తిగా వైదొలగనుంది.

టాటా గ్రూప్‌ సంస్థే అయిన మరో చౌకధరల విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో ఎయిరేషియా ఇండియా విలీనం 2023 చివరకు పూర్తయ్యే అవకాశం ఉందని ఎయిరిండియా తెలిపింది. విలీనం తర్వాత ఏర్పాటయ్యే సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌గా పనిచేయనుంది. 2014 జూన్‌లో టాటా గ్రూప్‌, ఎయిరేషియాలు సంయుక్తంగా ఎయిరేషియా ఇండియాను ప్రారంభించాయి. ఈ ఏడాది జూన్‌లో ఎయిరేషియా ఇండియాను ఎయిరిండియా కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది.

ప్రపంచంలో అతిపెద్ద విమానయాన విపణుల్లో ఒకటైన భారత్‌లో ఎయిరేషియా గొప్పగా రాణించిందని ఎయిరేషియా ఏవియేషన్‌ గ్రూప్‌ సీఈఓ బో లింగం తెలిపారు. టాటా గ్రూప్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, ఇప్పుడు వాటా అమ్మకంతో తమ అనుబంధం ముగియలేదని, మరిన్ని కొత్త అవకాశాలు అన్వేషిస్తున్నట్లు వివరించారు. మలేషియా, థాయ్‌లాండ్‌, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో ఎయిరేషియా కార్యకలాపాలు కొనసాగించనుంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ కింద నాలుగు విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిరేషియా ఇండియా, విస్తారా (సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్య సంస్థ) ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.