Stock market today India : అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 950 పాయింట్లు తగ్గి 57వేల 875 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 290 పాయింట్లు క్షీణించి 17వేల 270 వద్ద కొనసాగుతోంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్పర్సన్ జెరోమీ పావెల్ చేసిన ప్రసంగం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయేందుకు కారణమైంది. అగ్రరాజ్యంలో అంతకంతకూ ఎగబాకుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లు పెంచక తప్పదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దేశీయ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు.