ETV Bharat / business

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్​ మీ కోసమే! - Share Market Investment Tips

Stock Market Investment Tips In Telugu : మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? మీ పెట్టుబడులపై కచ్చితంగా మంచి లాభాలు రావాలా? అయితే ఇది మీ కోసమే. షేర్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​మెంట్స్​పై లాభాలు పొందడానికి పాటించాల్సిన టాప్​-7 టిప్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 5 Rules of Equity Investment
Stock Market Investment Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 12:18 PM IST

Stock Market Investment Tips : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాలతో జీవన కాల గరిష్ఠాలను చేరుకున్నాయి. దేశీయ ఆర్థిక పరిస్థితులు బాగుండడం, కీలక వడ్డీ రేట్లు తగ్గడం మొదలైన అంశాల వల్ల, దేశీయ స్టాక్ మార్కెట్​ వృద్ధి మరికొంత కాలం కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే షేర్ల విలువలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్​ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చా? వద్దా? అనే సందేహం కలగడం సహజం. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే ప్రతిఒక్కరూ పాటించాల్సిన కీలకమైన సూత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. దీర్ఘకాలిక లక్ష్యంతో పెట్టుబడి
    ప్రతి ఒక్కరికీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. ముఖ్యంగా మీ అవసరాలు, పెట్టుబడి కాలాలు, లక్ష్యాలు మొదలైన అంశాల ఆధారంగా ఒక మంచి ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, స్టాక్‌ మార్కెట్‌ పనితీరును ఎవ్వరూ కచ్చితంగా అంచనా వేయలేరు. నిన్నటి పనితీరు నేడు, నేటి పనితీరు రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అందువల్ల మంచి స్టాక్స్​ను ఎంచుకుని, దీర్ఘకాలంపాటు వాటిలో పెట్టుబడులను కొనసాగించాలి. అప్పుడే మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
  2. జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి
    మార్కెట్లు మంచి జోష్​లో ఉన్నప్పుడు లాభాలు రావడం సహజమే. అందువల్ల ఇటీవల చాలా మంది మార్కెట్ లాభాలు చూసి, నేరుగా షేర్లలో, ఈక్విటీ మ్యూచుఫల్​ ఫండ్లలో మదుపు చేస్తున్నారు. లేదా వీటిల్లో మదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లను, ఫండ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి తమ డబ్బు మొత్తాన్ని వీటికే కేటాయిస్తున్నారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. మార్కెట్‌ పనితీరు బాగున్నప్పుడు, మనకు ఎలాంటి ఇబ్బందీ రాదు. కానీ, మార్కెట్ కరెక్షన్​కు గురైతే, మనం భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కనుక పోర్ట్‌ఫోలియోను ఎంపిక చేసుకునేటప్పుడు నిపుణుల సలహాతో, బాగా పరిశోధన చేసి లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లను, ఫండ్లను మీ పోర్ట్​ఫోలియోలో చేర్చుకోవాలి. అప్పుడే నష్టభయం తక్కువగా ఉంటుంది. లాభాలు వచ్చే ఛాన్స్​ పెరుగుతుంది.
  3. పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్​
    మన డబ్బులను ఎప్పుడూ ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు. ముఖ్యంగా మన సొమ్ము మొత్తాన్ని స్టాక్స్​, మ్యూచువల్​ ఫండ్లలో మదుపు చేయకూడదు. మీ లక్ష్యం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా వివిధ రకాల పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే నష్టభయం తక్కువగా ఉంటుంది. మంచి రాబడిని ఆర్జించేందుకు కూడా వీలవుతుంది. పెట్టుబడి పథకాలను వృద్ధి, నాణ్యత, విలువ ఆధారంగా ఎంచుకోవాలి. నేడు ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మీకు ఏది సరిపోతుందో నిపుణుల సలహాతో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫిక్స్​డ్​ డిపాజిట్స్, రియల్ ఎస్టేట్​, బంగారం పెట్టుబడులుపైనా దృష్టి సారించాలి. అంతేకాదు మీ పెట్టుబడుల్లో 15 నుంచి 20 శాతం వరకు అంతర్జాతీయ ఫండ్లకు కూడా కేటాయించాలి.
  4. డెట్‌ ఫండ్లలో పెట్టుబడి
    కేవలం ఈక్విటీల్లోనే పెట్టుబడులు కొనసాగించడం ఏ మాత్రం మంచిది కాదు. కనీసం 10-15 శాతం వరకు డెట్‌ పథకాలకు మీ పెట్టుబడులను మళ్లించాలి. 10 శాతం వరకు బంగారంపైనా ఇనెస్ట్​ చేయాలి. ఈక్విటీ మార్కెట్‌లో దిద్దుబాటు వచ్చినప్పుడు ఈ పెట్టుబడులు కొంత మేరకు మీకు రక్షణ కల్పిస్తాయి. గత ఏడాది కాలంలో బంగారం 14 శాతం వరకు రాబడినిచ్చిన విషయం మీరు గమనించాలి. ఈటీఎఫ్‌లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌, ఇండెక్స్‌ ఫండ్ల ద్వారా పాసివ్‌ ఇన్​కమ్ సంపాదించే ప్రయత్నం చేయాలి.
  5. సమీక్షించుకోవాలి
    పెట్టుబడులు పెట్టడమే కాదు, వాటిని తరచుగా సమీక్షిస్తూ ఉండాలి. కొన్నిసార్లు సూచీల్లో వృద్ధి కారణంగా మీ ఈక్విటీ పెట్టుబడుల మొత్తం పెరిగిపోవచ్చు. అప్పుడు కొంత మేరకు లాభాలను స్వీకరించి, వాటిని సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించాలి. ముఖ్యంగా లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పథకాల్లో ఉన్న పెట్టుబడులను పరిశీలిస్తూ ఉండాలి. వీలైనంత వరకు లార్జ్ క్యాప్​ స్టాక్స్​లో పెట్టుబడులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, ఇవి మార్కెట్ ఒడుదొడుకులను చాలా వరకు తట్టుకుంటాయి.
  6. మీడియా వార్తలు
    మీడియాలో వచ్చిన వార్తలు కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి. కనుక పెట్టుబడిదారులు షేర్ మార్కెట్​కు సంబంధిన వార్తల​ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మార్కెట్‌ పరిస్థితులను అర్థం చేసుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మీకు మంచి లాభాలు వస్తాయి.
  7. అనవసర భయాలు వద్దు!
    ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్‌ మంచి లాభాలను అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొంత మంది తమకు వచ్చిన లాభాలను వెనక్కి తీసుకొని, మార్కెట్‌ నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన చేస్తుంటారు. ఇది సరైన నిర్ణయం కాదు. దీర్ఘకాలిక లక్ష్యంతో మదుపు చేస్తున్నప్పుడు ఇలాంటి స్వల్పకాలిక లాభాలపై దృష్టి పెట్టకూడదు. కొన్ని సందర్భాల్లో మార్కెట్ నష్టాల్లోకి జారుకుంటుంది. ఇలాంటి సమయంలో చాలా మంది భయపడి, తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదు. దీర్ఘకాలంలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేసిన వారికి, మంచి రాబడులు వస్తాయని చరిత్ర చెప్తోంది. కనుక నిపుణుల సలహాతో దీర్ఘకాలం పాటు మీ పెట్టుబడులను కొనసాగించాలి. అప్పుడే లాభాలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.

బ్యాంకు రుణాలపై ఎన్నో ఛార్జీలు- ఏ లోన్​పై ఎంత వేస్తారో తెలుసా?

వాహన ఇన్సూరెన్స్ ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుందా? ఈ సింపుల్​ ట్రిక్స్​​తో భారం తగ్గించుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.