ETV Bharat / business

ఈ పెట్టుబడులతో మీ పిల్లల ఆర్థిక భవిష్యత్​కు ఫుల్ సేఫ్టీ - saving schemes

పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పిల్లల భ‌విష్య‌త్‌కు సరిపడా మెుత్తాన్ని తల్లిదండ్రులు పొదుపు చేయాలి. తల్లిదండ్రులు పిల్లల విద్యకు, వివాహానికి, ఇతర ఖర్చులకు ముందుగానే పెట్టుబడులు పెట్టి స్ప‌ష్ట‌మైన ఆర్థిక ల‌క్ష్యాల‌ను క‌లిగి ఉండాలి. వాటికి సంబంధించి కొన్ని పథకాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల భవిష్యత్ పథకాలు
schemes for children
author img

By

Published : Aug 18, 2022, 5:31 AM IST

Saving schemes for children: పిల్ల‌ల భ‌విష్య‌త్‌కు డ‌బ్బులు పొదుపు చేయడం అంటే వాళ్ల‌ కోసం ఆస్తులు పోగు చేయడమే కాదు.. వారి చ‌దువుల‌కు, వివాహానికి కూడా స‌రిప‌డా ఆదా చేయ‌డం. పిల్ల‌ల విద్య‌కు స‌రిప‌డినంత మొత్తం సమయానికి అందేలా ఏర్పాటు చేసుకోవాలి. త‌ల్లిదండ్రులు స్ప‌ష్ట‌మైన ఆర్థిక ల‌క్ష్యాల‌ను క‌లిగి ఉండాలి. విద్యా నిధికి వ్యూహాత్మ‌క పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయాలి.

పెరుగుతున్న ఫీజులు, ఉన్న‌త విద్య‌కు సంబంధించిన ఇత‌ర ఖ‌ర్చుల‌ను ముందు నుంచి సిద్ధం కాక‌పోతే భ‌విష్య‌త్‌లో భ‌రించ‌డం త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక భారంగా ఉంటుంది. పిల్ల‌ల విద్యా విష‌య‌మై త‌ల్లిదండ్రులు త‌మ పెట్టుబ‌డుల‌ను త‌క్కువ మొత్తంతో ప్రారంభించినా.. త‌ర్వాత పెట్టుబ‌డుల‌ను పెంచుకుంటూ వెళ్లాలి. కాబట్టి పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన కొన్ని పథకాలను ఇక్కడ అందిస్తున్నాం. వాటిని ఓ సారి పరిశీలించండి..

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న
saving schemes for girl child: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న అనేది ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్‌ కోసం ఉద్దేశించిన పథకం. 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న బాలిక‌ల పేరు మీద మాత్ర‌మే ఖాతా తెర‌వొచ్చు. సంవ‌త్స‌రానికి క‌నిష్ఠంగా రూ.250, గరిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ ఖాతాలో మ‌దుపు చేయొచ్చు. ప్ర‌స్తుతం దీని వ‌డ్డీ రేటు ఏడాదికి 7.60 శాతంగా ఉంది.

5 సంవ‌త్స‌రాల త‌ర్వాత, వైద్య‌ప‌ర‌మైన అవసరాల కోసం మాత్ర‌మే ఖాతా ముంద‌స్తు మూసివేత‌కు అనుమ‌తిస్తారు. అలాగే, అమ్మాయికి 18 ఏళ్లు నిండిన‌ప్పుడు ఉన్న‌త విద్య కోసం గ‌త సంవ‌త్స‌రం ఖాతా నిల్వ‌లో గ‌రిష్ఠంగా 50% ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అమ్మాయి వివాహం కోసం అయితే 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌ర్వాత ఎప్పుడైనా ఖాతా మూసివేత‌కు అనుమ‌తి ఉంటుంది. సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు అర్హ‌త ఉంటుంది. వ‌చ్చిన వ‌డ్డీ రాబ‌డిపై ప‌న్ను లేదు. ఈ ప‌థ‌కానికి ప్ర‌భుత్వ హామీ ఉంది.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా
Tax saving schemes: ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అనేది 15 సంవ‌త్స‌రాల ప‌థ‌కం. దీనికి 15 సంవ‌త్స‌రాల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా చందా చెల్లించాలి. క‌నిష్ఠంగా రూ. 500, గ‌రిష్ఠంగా రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు చందాను చెల్లించొచ్చు. అవ‌స‌ర‌మైన ప‌క్షంలో 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత పీపీఎఫ్ నుంచి నిష్క్ర‌మించొచ్చు. లేదా 4వ సంవ‌త్స‌రం నుంచి రుణం పొందొచ్చు. 7వ సంవ‌త్స‌రం త‌ర్వాత నిధుల‌ను పాక్షికంగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఒక‌రి పేరుతో ఒక ఖాతాను మాత్ర‌మే తెర‌వ‌డానికి అనుమ‌తి ఉంటుంది. మైన‌ర్ పిల్ల‌ల పేరుతో కూడా ఖాతా తెర‌వొచ్చు. పీపీఎఫ్ ఖాతాలో చేసిన పెట్టుబ‌డి సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు అర్హ‌త ఉంటుంది. వ‌డ్డీకి ఆదాయ ప‌న్ను లేదు. ఈ ప‌థ‌కానికి ప్ర‌భుత్వ హామీ ఉంది.

వీపీఎఫ్
schemes for employees: ఉద్యోగాలు చేసే త‌ల్లిదండ్రులయితే త‌మ వేత‌నంలో క‌ట్ అయ్యే 12% ప్రావిడెంట్ ఫండ్‌ కాక వాళ్ల ఆర్థిక స్థితిని బ‌ట్టి ఇంకా కొద్ది శాతం మొత్తాన్ని పీఎఫ్ నిధికి కేటాయించొచ్చు. ఇది స్వచ్చందంగా చేసే మ‌దుపు కాబ‌ట్టి దీన్ని వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. పీఎఫ్ వడ్డీ దీనికి కూడా వర్తిస్తుంది. ఇత‌ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల క‌న్నా పీఎఫ్‌/వీపీఎఫ్ వ‌డ్డీ ఎక్కువే అని చెప్పాలి. దీనికి వ‌డ్డీ ప్ర‌స్తుతం 8.10 శాతంగా ఉంది. పీఎఫ్ ఖాతాలో చేసిన పెట్టుబ‌డిపై సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. సంపాదించిన వ‌డ్డీకి ఆదాయ ప‌న్ను లేదు.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్
sip mutual funds: క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు ద్వారా పెట్టుబ‌డి పెట్టేవారి సంఖ్య భార‌త్‌లో బాగా పెరిగింది. క‌నీసం ప‌దేళ్ల‌ దూరంలో ఉన్న పిల్ల‌ల ల‌క్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డాన్ని యువ త‌ల్లిదండ్రులు ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. లార్జ్‌-క్యాప్‌, ఫండ్స్‌లో స్థిర‌మైన ప‌నితీరు గ‌ల ప‌థ‌కాల్లో పెట్టుబ‌డుల‌ను పెట్టొచ్చు. పిల్లల చదువు కోసం కాబట్టి రిస్క్ తక్కువగా ఉన్న ఇండెక్స్ ఫండ్స్ ఎంచుకోవడం మేలు. పిల్ల‌ల విద్యా ఖ‌ర్చులు మొద‌ల‌య్యే 2-3 సంవ‌త్స‌రాల ముందే ఈ పెట్టుబ‌డులను ఉపసంహ‌రించి.. ఆ మొత్తాల‌ను ఫిక్సిడ్ డిపాజిట్ లాంటి హామీ ఉన్న ప‌థ‌కాల్లో మ‌దుపు చేయాలి. ఇలా చేస్తే చివరి 2-3 ఏళ్లలో మార్కెట్ అనిశ్చితిని త‌ట్టుకోవ‌చ్చు. దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు పెట్టేవారికి మంచి లాభాల‌ను ఇచ్చిన చ‌రిత్ర దేశ మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌రిశ్ర‌మ‌కి ఉంది. ఇందులో మీకు తగినంత సమాచారం లేనప్పుడు ఆర్థిక సలహాదారుని సంప్రదించి పెట్టుబ‌డులు పెట్టడం మంచిది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.