ETV Bharat / business

'రిషిని చూసి గర్విస్తున్నా'.. అల్లుడిని పొగడ్తలతో ముంచెత్తిన నారాయణమూర్తి! - రిషి సునాక్ కుటుంబం

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎంపిక కావడంపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు. రిషిని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు. బ్రిటన్ ప్రజల కోసం రిషి.. తన వంతు కృషి చేస్తారనే నమ్మకం ఉందని నారాయణ మూర్తి అన్నారు.

infosys narayana murthy on rishi sunak
రిషి సునాక్
author img

By

Published : Oct 25, 2022, 11:02 AM IST

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎంపిక కావడంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి స్పందించారు. రిషిని చూసి గర్విస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి సొంత అల్లుడు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి- సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షితకు.. రిషితో 2009లో వివాహం జరిగింది.
'రిషికి అభినందనలు. మేము ఆయన్ను చూసి గర్విస్తున్నాం. రిషి విజయాన్ని కోరుకుంటున్నాం. యూకే ప్రజల కోసం రిషి తన వంతు కృషి చేస్తారని నమ్మకం ఉంది' అని నారాయణమూర్తి అన్నారు.

అధికారిక లాంఛనాలు పూర్తి చేసుకుని మంగళవారమే బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 210 ఏళ్ల యూకే ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత పిన్నవయసున్న ప్రధానిగా 42 ఏళ్ల రిషి రికార్డు సృష్టించనున్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 9 గంటలకు ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ కార్యాలయంలో.. తన చివరి కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆమె బకింగ్‌హామ్ ప్యాలస్‌కు వెళ్లి రాజు చార్లెస్‌-3కి రాజీనామా పత్రం సమర్పిస్తారు.

అనంతరం, రిషి సునాక్ రాజభవనానికి వెళ్లి రాజు ఛార్లెస్‌తో సమావేశమవుతారు. రాజు చార్లెస్‌.. సునాక్‌ను ప్రధానిగా ప్రకటిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా లాంఛనంగా సునాక్‌ను ఆహ్వానిస్తారు. తర్వాత అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల 35 నిమిషాలకు... భార్య అక్షత మూర్తి, పిల్లలతో కలిసి రిషి సునాక్‌ బ్రిటిష్‌ ప్రధానిగా 10 డౌనింగ్‌ స్ట్రీట్ కార్యాలయానికి వెళతారు. అక్కడే యూకే ప్రధానమంత్రిగా తన తొలి ప్రసంగం చేస్తారు.

మోదీ అభినందన..
మరోవైపు, బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన రిషి సునాక్​కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ సైతం రిషికి శుభాకాంక్షలు తెలిపారు. రిషి బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయనతో కలిసి ప్రపంచ సమస్యలపై సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, రోడ్‌మ్యాప్‌ 2030ని అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్‌ చేశారు.

రిషి సునాక్​.. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ నగరంలో జన్మించారు. అయితే రిషి పూర్వీకుల మూలాలు భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. బోరిస్‌ జాన్సన్‌ హయాంలో బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు పొందిన రిషి సునాక్‌.. తాజాగా ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

గతంలో లిజ్‌ ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడ్డ రిషి సునాక్‌ ఎంపీల మద్దతు సాధించారు. కానీ కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన టోరీ సభ్యుల మనసు గెలవలేకపోయారు. అయితే తాను తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం వల్ల బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోపే లిజ్‌ ట్రస్‌ వైదొలిగారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థికమంత్రిగా పని చేసిన రిషి సునాక్‌ ఎంపీల మద్దతు కూడగట్టి బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు.

ఇవీ చదవండి: 'ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు శాయశక్తులా కృషి చేస్తా'.. ప్రధానిగా ఎన్నికైన అనంతరం రిషి

విదేశాల్లోనూ 'కింగ్​'లే.. ఆరు దేశాల అధ్యక్షులుగా భారత సంతతి వ్యక్తులు

హిందూ మూలాలను మరవని రిషి సునాక్​.. భగవద్గీతపైనే ప్రమాణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.