ETV Bharat / business

హెచ్​డీఎఫ్​సీ విలీనం.. నిఫ్టీలో ఒడుదొడుకులు.. ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరో? - హెచ్​డీఎఫ్​సీ లేటెస్ట్ న్యూస్

హెచ్‌డీఎఫ్‌సీ .. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం అయితే నిఫ్టీలో ఒడుదొడుకులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సూచీలో అధిక షేర్లు ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ.. సూచీ నుంచి బయటకు వెళ్తే ప్యాసివ్‌ ఫండ్ల నుంచి సుమారు 1.3 నుంచి 1.5 బిలియన్‌ డాలర్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

HDFC Bank
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్
author img

By

Published : Oct 20, 2022, 1:26 PM IST

నిఫ్టీ 50 సూచీలో 5.5 శాతం షేర్ల ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పుడు సూచీ నుంచి బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్​లో అతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కాబోతున్న నేపథ్యంలో నిఫ్టీ సూచీ నుంచి బయటకు రావచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సంస్థల విలీనానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు పలు నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించింది.

ఈ విలీన ప్రతిపాదన అనుమతి కోసం వచ్చే నెల 25న వాటాదార్ల సమావేశం నిర్వహించేందుకు రెండు సంస్థలు సిద్ధమవుతున్నాయి. నిఫ్టీ సూచీలో అధిక షేర్లు ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ.. సూచీ నుంచి బయటకు వెళ్తే ప్యాసివ్‌ ఫండ్ల నుంచి సుమారు 1.3 నుంచి 1.5 బిలియన్‌ డాలర్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. సూచీ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బయటకు వచ్చేస్తే నిఫ్టీలో ఒడుదొడుకులు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ స్థానాన్ని భర్తీ చేయడానికి పిడిలైట్‌, అంబుజా సిమెంట్‌, టాటా పవర్‌ సంస్థలు పోటీపడుతున్నట్లు చెబుతున్నారు.

ఇవీ చదవండి: దీపావళికి పసిడి మెరుపులు.. గతేడాది స్థాయిలోనే ధర.. గిరాకీ ఆశావహం

రూ.1353 కోట్లతో దుబాయ్​లో మరో విల్లా కొన్న అంబానీ.. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డీల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.