ETV Bharat / business

Personal Loan Requirements : పర్సనల్​ లోన్ కావాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! - క్రెడిట్​ స్కోర్​ను ఎలా పెంచుకోవాలి

Personal Loan Requirements In Telugu : మీరు పర్సనల్​ లోన్​ తీసుకుందామని అనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం పొందాలని భావిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. వ్యక్తిగత రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు ఏమేమి చూస్తాయి? రుణగ్రహీతలుగా మనం ఏమేమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Personal Loan Requirements In Telugu
Personal Loan Requirements To Know Before Applying
author img

By

Published : Jul 31, 2023, 1:08 PM IST

Personal Loan Requirements To Know Before Applying : నేటి కాలంలో వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకోవడం చాలా పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా విద్య, వైద్యం, వివాహ ఖర్చులతో పాటు, ఇంటి నిర్మాణ మరమ్మత్తులు, అత్యవసర వైద్య ఖర్చులు సహా ఇతర అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే బ్యాంకులు తమ నియమ, నిబంధనలను అనుసరించి ఈ రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. అందుకే సరైన పత్రాలు, ట్రాక్​ రికార్డు లేని వారికి రుణాలు మంజూరు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మంచి క్రెడిట్​ స్కోర్​, రుణ చెల్లింపు సామర్థ్యం ఉన్నవారికి మాత్రం తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది. అందుకే వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఏఏ అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారంటే?
Personal loan interest rate : బ్యాంకులు పర్సనల్​ లోన్స్​ మంజూరు చేసే ముందు.. రుణ మొత్తం, దరఖాస్తుదారుని ఉద్యోగ చరిత్ర, క్రెడిట్ స్కోర్​, నెలవారీ ఆదాయం, లోన్​-టు-వాల్యూ రేషియో, రుణ చెల్లింపు సామర్థ్యం మొదలైన అంశాలను కచ్చితంగా పరిశీలిస్తాయి. నేడు చాలా బ్యాంకులు 11-14 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. రుణ యాప్​లు అయితే 28-30 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. కనుక అత్యవసరమైతే తప్ప రుణ యాప్​ల నుంచి పర్సనల్ లోన్స్ తీసుకోకపోవడమే మంచిది.

క్రెడిట్ స్కోర్​ బాగుండాలి!
Personal loan Credit score : మంచి క్రెడిట్ స్కోర్​ ఉన్నవారికి బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్​ 750 పాయింట్లు కంటే అధికంగా ఉన్నవారికి.. సులభంగా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. క్రెడిట్ స్కోర్​ 600 పాయింట్లు కంటే తక్కువ ఉన్నవారికి రుణాలు మంజూరు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒక వేళ మంజూరు చేసిన అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తారు.

క్రెడిట్​ స్కోర్ మెరుగ్గా ఉండాలంటే.. క్రెడిట్​ కార్డు బిల్లులను, రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తూ ఉంటాలి. ఒక వేళ మీరు ఏ రుణానికైనా సహ దరఖాస్తుదారునిగా ఉంటే, ఆ రుణాన్ని కూడా సకాలంలో చెల్లించేలా చూసుకోవాలి. మీరు కనుక క్లీన్​ పేమెంట్​ హిస్టరీ కలిగి ఉంటే.. బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది.

వినియోగ నిష్పత్తి 30%లోపు ఉండాలి!
Personal Loan Credit Utilization Ratio : మీ క్రెడిట్​ స్కోర్​ను పరిశీలించేటప్పుడు.. క్రెడిట్​ యుటిలైజేషన్​ రేషియో (సీయూఆర్​)ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల మీ క్రెడిట్​​ కార్డు పరిమితిలో కేవలం 30 శాతం వరకు మాత్రమే వినియోగించుకోవాలి. ఒక వేళ మీ అవసరాలు ఎక్కువగా ఉంటే, మీ కార్డు పరిమితిని పెంచమని క్రెడిట్​ కార్డు మంజూరు చేసిన సంస్థను కోరండి.

మల్టిపుల్​ అప్లికేషన్స్​ పెట్టకండి!
Multiple Personal Loan Inquiries : కొంత మంది వ్యక్తిగత రుణం కోసం లేదా క్రెడిట్ కార్డు కోసం ఒకే సమయంలో వివిధ బ్యాంకుల్లో దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్​ దెబ్బతింటుంది. కనుక రుణాల కోసం ఒకేసారి మల్టిపుల్ అప్లికేషన్లు పెట్టకండి.

శాలరీ అకౌంట్​లో ఉన్న బ్యాంకులో రుణం కోసం ప్రయత్నించండి!
Personal Loan Salary Account : పర్సనల్​ లోన్​ వేగంగా రావాలంటే.. మీ శాలరీ అకౌంట్​/ డిపాజిట్స్​/ క్రెడిట్​ కార్డు ఉన్న బ్యాంకులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే సదరు బ్యాంకుకు.. మీ నెలవారీ ఆదాయం, వినియోగం తదితర వివరాలు పూర్తిగా తెలుస్తాయి. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, నెలవారీ జీతం సంపాదిస్తున్నవారికి.. సరసమైన వడ్డీ రేట్లతో పాటు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజులతో బ్యాంకులు రుణాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. నేడు చాలా బ్యాంకులు ప్రముఖ సంస్థల ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేట్​ తగ్గింపులను అందిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు పండగల సీజన్​లో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ ఉంటాయి. ఈ సందర్భాలను కూడా వినియోగించుకోవడం మంచిది.

జాబ్​ ప్రొఫైల్​ చూస్తారు!
Personal Loan Job Profile : వ్యక్తిగత రుణాలు మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు.. దరఖాస్తుదారుని ఉద్యోగ చరిత్రను కూడా పరిశీలిస్తాయి. ముఖ్యంగా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉపాధి చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ప్రాధాన్యతను ఇస్తాయి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసేవారికి, పబ్లిక్ సెక్టార్​ యూనిట్లు (పీఎస్​యూ)ల్లో పనిచేసేవారికి.. బ్యాంకులు చాలా త్వరగా, తక్కువ వడ్డీకి రుణాలు అందించడానికి మొగ్గు చూపుతాయి. మల్టీ నేషనల్​ కంపెనీల్లో పనిచేసేవారికి కూడా ప్రాధాన్యం ఇస్తాయి.

కచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి!
Personal loan required documents : పర్సనల్​ లోన్​ తీసుకునేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణ మొత్తం, వడ్డీ రేటు మాత్రమే కాకుండా.. ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్​టీ లాంటి ఇతర ఛార్జీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. కొన్ని బ్యాంకులు ఫ్లాట్​ ప్రాసెసింగ్​ ఫీజును వసూలు చేస్తాయి. మరికొన్ని రుణ మొత్తంపై 1-3 శాతం వరకు ఫీజును వసూలు చేస్తాయి. ఒక వేళ రుణాన్ని ముందస్తుగానే తీర్చేయాలని అనుకుంటే.. ఫోర్​క్లోజర్​ ఛార్జీలను వసూలు చేస్తాయి. కనుక లోన్​ తీసుకునే ముందే రుణ సంస్థల నియమ, నిబంధనలను.. షరతులతో సహా తెలుసుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.