ETV Bharat / business

కార్యాలయ స్థలాల లీజింగ్​లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌

OFFICE SPACE LEASE HYD: కార్యాలయ స్థలాల లీజింగ్​లో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని వివిధ కార్పొరేట్ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2021 నాటి లెక్కలతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం కావడం విశేషం.

OFFICE SPACE LEASE REPORT
OFFICE SPACE HYD
author img

By

Published : Jul 5, 2022, 7:43 AM IST

OFFICE SPACE LEASE REPORT: కార్పొరేట్ల నుంచి గిరాకీ పెరగడంతో హైదరాబాద్‌ సహా, దేశ వ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్‌ పెరిగింది. ఏప్రిల్‌- జూన్‌లో హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, పుణె నగరాల్లో కలిపి మొత్తం 1.40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నట్లు స్థిరాస్తి సేవల సంస్థ కొలియర్స్‌ ఇండియా పేర్కొంది. 2021 ఇదే కాలం నాటి లీజు విస్తీర్ణం 56 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే ఇది దాదాపు 2.5 రెట్లు అని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి- జూన్‌లో చూస్తే, ఈ ఆరు ప్రధాన నగరాల్లో మొత్తం 2.75 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకు వెళ్లింది. 2021 ఇదే కాలంలో ఈ మొత్తం 1.03 కోట్ల చదరపు అడుగులుగా ఉంది.

మూడు రెట్లు ఎక్కువగా...
హైదరాబాద్‌లో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 23 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. 2021 ఇదే కాలం నాటి లీజ్‌ 7 లక్షల చ.అ.తో పోలిస్తే, ఈసారి 3 రెట్లు అధికంగా వెళ్లింది. ఈ ఏడాది జనవరి- జూన్‌లో మొత్తం 45 లక్షల చ.అ. కార్యాలయ స్థలాన్ని కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడ లీజుకు తీసుకున్నాయి. 2021 ఇదే కాలంలో ఇది 11 లక్షల చ.అడుగులేనని నివేదిక వెల్లడించింది.

ఏప్రిల్‌-జూన్‌లో చూస్తే బెంగళూరులో 44 లక్షలు, చెన్నైలో 11లక్షలు, దిల్లీలో 27 లక్షలు, ముంబయిలో 28 లక్షలు, పుణెలో 14 లక్షల చదరపు అడుగుల చొప్పున కార్యాలయాల స్థలం అద్దెకు తీసుకున్నారు.
మరింత గిరాకీ పెరుగుతుంది: రాబోయే రెండు త్రైమాసికాల్లో కార్యాలయ స్థలానికి మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉందని కొలియర్స్‌ ఇండియా సీఈఓ రమేశ్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 6 నగరాల్లో దాదాపు 4-4.5 కోట్ల చ.అ. విస్తీర్ణం మేర కార్యాలయాల స్థలం లీజింగ్‌కు అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.