ETV Bharat / business

మ్యారేజేస్‌ అర్‌ మేడిన్‌ హెవెన్‌ కాదు మ్యారేజేస్‌ ఆర్‌ మేడిన్‌ సోషల్ మీడియా - ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

Marriages Are Made in Social Media : ప్రేమకు కులం మతం ప్రాంతంతో సంబంధం లేదు. అడ్డుగోడలు లేవు. ఇవన్నీ కొటేషన్లు కాదు. మన సమాజంలో జరిగిన ఎన్నో ప్రేమ పెళ్లిళ్లకు ఉదాహరణలు. మ్యారేజేస్‌ అర్‌ మేడిన్‌ హెవెన్‌ అన్నాడో కవి. కానీ, ఇటీవల మ్యారేజేస్‌ ఆర్‌ మేడిన్‌ సోషల్ మీడియా అయిపోయాయి. ప్రేమకు సరిహద్దులు ఉంటాయి. కానీ, సోషల్‌ మీడియాకు ఎందుకు సరిహద్దులు. ఎంచక్కా నచ్చిన వారితో తమ ప్రేమ పంచుకోవచ్చు. వారి అభిరుచులు కలిస్తే ఒక్కటవచ్చు. కొన్ని రోజుల నుంచి....ఇలాంటి సంఘటనలనే చూస్తున్నాం. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన సీమా హైదర్‌... భారత్‌ నుంచి పాకిస్థాన్‌ వెళ్లిన అంజు...పోలాండ్‌ నుంచి భారత్‌ వచ్చిన బార్బరా పోలాక్‌. ఈ ముగ్గురు మహిళలు ప్రేమ కోసం ఏకంగా దేశాలు విడిచి ప్రయాణించారు. దీనంతటికి కారణం సోషల్‌ మీడియానే. మరి, ఈ కాలంలో అది కూడా పిల్లలు ఉన్న ఈ మహిళలు వయస్సులతో సంబంధం లేకుండా ప్రేమ వివాహలు చేసుకోవడం ఎలా చూడవచ్చు? ప్రస్తుత కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూడటానికి కారణమేంటి..? సోషల్‌ మీడియానే ఇందుకు ప్రధాన కారణమా? లేకపోతే ఉగ్ర కుట్ర కోణలు ఏమైనా ఉన్నాయా...?

Marriages Are Made in Social Media
మ్యారేజ్‌స్‌ అర్‌ మేడిన్‌ హెవెన్‌
author img

By

Published : Jul 28, 2023, 1:18 PM IST

Marriages Are Made in Social Media : ఇప్పటివరకు ఎన్నోరకాల ప్రేమ కథల్ని భారతీయుులు చూశారు. కానీ, ఇటీవల బయటపడుతున్న లవ్‌ స్టోరీలు ఇప్పుడు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఒకరు పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు రాగా మరొకరు భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లారు. వీరే అనుకుంటే మరో మహిళ ఏకంగా ఖండాలు దాటి ప్రేమించిన ప్రియుడి కోసం ఏకంగా పొలాండ్‌ నుంచి భారత్‌కు వచ్చింది. వీరంతా వేర్వేరు నేపథ్యాలు ప్రాంతాలకు చెందిన మహిళలుకానీ, వీరిని కలిపింది మాత్రం ఒకే ఒక్క వేదిక అదే, సోషల్‌ మీడియా. అయినా, ఇందులో ఏముంది కొత్త అంటారా...? ఎందుకంటే సోషల్‌ మీడియా పరిధి విస్తృతం అయ్యాక లవ్‌ మ్యారేజ్‌లు పెరిగాయి కదా వీరు అలానే చేసుకున్నారు అనుకోవచ్చు అని అనుకుంటారు అంతేనా. కానీ, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రేమ పెళ్లిళ్లైతే కొంచెం వింతే. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.

Marriages Are Made in Social Media
మ్యారేజ్‌స్‌ అర్‌ మేడిన్‌ హెవెన్‌

సీమా హైదర్‌: ఈ మహిళ కథ వింటే బాలీవుడ్‌ స్టోరీ సైతం సరిపోదేమో. ఎందుకంటే కొవిడ్‌ లాక్‌డౌన్ సమయంలో సరాదాగా ఆన్‌లైన్‌లో ఆడిన పబ్‌జీ ఆటతో భారత్‌లో ఉంటున్న సచిన్‌ మీనాతో పరిచయం ఏర్పడేలా చేసింది. క్రమంగా ఆ స్నేహం ప్రేమగా మారింది. అయితే, సీమాకు ఏడేళ్లలోపు వయసున్న నలుగురు పిల్లలు ఉన్నారు. సీమా భర్త ఉపాధి నిమిత్తం సౌదీలో పనిచేస్తున్నాడు. రెండేళ్లు ప్రేమించుకుని మొదటిసారిగా ఈ ఏడాది మార్చిలో నేపాల్‌లో కలుసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అలా తన నలుగురు పిల్లల్ని తీసుకుని మే13న నేపాల్‌ నుంచి బస్సులో భారత్‌కు చేరుకున్న సీమా గ్రేటర్‌ నొయిడాలోని సచిన్‌ వద్దకు చేరుకుంది. తర్వాత సీమా పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్టు పోలీసులకు తెలియడంతో ఆరెస్టు చేయడం జరిగింది. తర్వాత విడుదల అయ్యింది. ఇప్పుడు పాకిస్థాన్‌ పౌరసత్వం విడిచిపెట్టుకుని భారతీయ పౌరసత్వం కోసం రాష్ట్రపతికి దరఖాస్తు కూడా చేసుకుంది. సచిన్‌ కుటుంబీకులు మాత్రం సీమాను పూర్తిగా నమ్మారు. ఇప్పుడు వారే తనకు సాయంగా ఉంటున్నారు. దీంతో ఈ ప్రేమ కథ రాష్ట్రపతి కోర్టులో ఉంది. కానీ, అనుకున్నంత సులభంగా పౌరసత్వం వచ్చే అవకాశాలు లేవు. దీంతో తదుపరి పరిణామాలపై ప్రస్తుతానికైతే ఉత్కంఠ నెలకొంది.

Read more: 'సీమా హైదర్‌ పాకిస్థాన్ ఏజెంట్‌?'.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి

అంజు లవ్‌ స్టోరీ: సీమా సంఘటనను మరవకముందే మరో ప్రేమ పెళ్లి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అదే, అంజు లవ్‌ స్టోరీ. 35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా ఖాన్‌ను వెతుక్కుంటూ పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాకు చేరుకుంది. 2007లోనే వివాహమైన అంజుకి 15 ఏళ్ల కుమార్తె...6ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, అంజు ఫేస్‌బుక్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా ఖాన్‌తో ప్రేమలో పడింది. ప్రస్తుతం ఆ యువకుడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అంజు తన భర్తకు రాజస్థాన్ చూడటానికి వెళ్తున్నాని చెప్పి పాకిస్థాన్‌కు వెళ్లి పోయింది. అక్కడ తన పేరును ఫాతిమాగా మార్చుకుని స్నేహితుడైన నుస్రుల్లాను పెళ్లి కూడా చేసుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, సీమా వెళ్లిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే అతడిని కలుసుకునేందుకు వాఘా బార్డర్‌ గుండా వెళ్లింది. అది కూడా ఆ దేశ వీసా ద్వారా..ఇప్పుడిదే తీవ్ర చర్చకు దారితీస్తోంది. భారత్‌లో ఉంటున్నఅంజుకు పాకిస్థాన్‌ వీసా కోసం ఎవరూ సాయం చేశారు? ఇంట్లో వారికి తెలియకుండానే అంత దూరం ఎలా ప్రయాణించింది...? అసలు, దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందన్న సందేహలు వ్యక్తమవుతున్నాయి.

Read more: ఫేస్‌బుక్‌ లవ్​ .. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

బార్బరా టిక్‌టాక్ లవ్‌: ఆ రెండు సంఘటనలకు భిన్నంగా ఉంటుంది... ఈ ప్రేమ జంట స్టోరీ. ఇది ఏకంగా ఖండంతరాలు దాటిన ప్రేమ కథా చిత్రం. పొలాండ్‌కు చెందిన 44 ఏళ్ల బార్బరా 27 ఏళ్ల షాదాబ్ కోసం భారత్‌కు వచ్చింది. షాదాబ్‌ మంచి డ్యాన్సర్ తన వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసేవాడు. అలా బార్బరాతో పరిచయం ఏర్పడింది. మెుదట్లో విదేశీ మహిళ అని భయపడినా... మెల్లగా పరిచయం పెంచుకుని ఇద్దరు ప్రేమలో పడ్డారు. దీంతో ప్రేమించిన వ్యక్తి కోసం బార్బరా 2021లో భారత్‌కు వచ్చేసింది. అయితే వీరు చట్టబద్దంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థికంగా స్థిరపడిన బార్బరాపై ఆధారపడి కూడా షాబాద్‌ పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేక పోలేదు. కాబట్టి ఒక్కో ప్రేమకు...ఒక్కో కథ ఉందని అంటున్నారు నిపుణులు.

Read more : ఇన్ ​స్టాలో పరిచయం.. ప్రియుడి కోసం భారత్ వచ్చిన పోలాండ్ మహిళ.. ఆరేళ్ల కూతురితో..

ఈ మూడు కథలే కాదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీచర్‌, యువకుడి ప్రేమ కథ మరో సంచలనం. ఒకే ఒక్క మిస్డ్‌ కాల్‌తో ఏర్పడ్డ పరిచయం కాస్తా అనేక మలుపులు తిరిగి వారి చావులకు కారణమయ్యింది. ఈ ప్రేమ కథలలో కామన్‌గా కన్పిస్తోన్నఅంశం. పెళ్లైన మహిళలు వారికన్నవయస్సులో తక్కువగా ఉన్నయువకులతో ప్రేమలో పడటం. సీమా హైదర్‌ తనకన్న 6ఏళ్లు చిన్న వయస్సున్న సచిన్‌ను పెళ్లి చేసుకుంది. అంజు తన కన్న వయస్సులో 5ఏళ్లు చిన్నవాడైనా నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. పోలాండ్‌కు చెందిన బార్బరా తన కన్న 15ఏళ్లకు పైగా చిన్నవాడైనా షాదాబ్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది. మళ్లీ వీరందరికీ పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మెుత్తం పరిచయాలన్ని సోషల్‌ మీడియా ద్వారానే జరగడం మరో విడ్డూరం. దీంతో ఒక్కసారిగా ఈ వార్తలపై అందరికీ ఆసక్తి మెుదలైంది. కానీ, దీని వెనుక కుట్ర కోణం కూడా లేక పోలేదని నిపుణులు అంటున్నారు. తమకన్న వయస్సులో చిన్నవారిని చేసుకోవడం ‌చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, దీని సందేశం సమాజంలో మరో విధంగా వెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది వారి పిల్లలు, భర్త, కుటుంబంపై కూడా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Marriages Are Made in Social Media
మ్యారేజ్‌స్‌ అర్‌ మేడిన్‌ హెవెన్‌

ఎటువంటి సాయం లేకుండానే సీమా నేపాల్‌కు వచ్చి అక్రమంగా భారత్‌లోకి రావడం పలు అనుమానాలుకు తావిస్తోంది. అంతేగాక అంజుకు పాకిస్థాన్‌ వీసా ఎలా లభించిందన్న దానిపై కూడా చర్చ మెుదలైంది. గతంలో ఎన్నో రకాల వలపు వలల సంఘటనలను మనం చూశాం. ఈ హనీ ట్రాప్‌లో చిక్కుకోని చాలా మంది శాస్ర్తవేత్తలు, సైనికులు దేశ రక్షణ సమాచారం చేరవేసిన సంఘటనలను బయటపడ్డాయి. అందుకే సాయుధ బలగాల్లో పని చేసేవారు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికులు జారీ చేశారు. అంతేగాక లవ్‌జిహద్‌ పేరుతో భారతీయ అమ్మాయిలు పాకిస్థాన్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. దీనిపై పలు సందర్భాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. ఇలా ఇన్ని కారణాలతో ముడిపడ్డ అంశాలు కావడంతో వీటిని దేశ అంతర్గత భద్రతకు సవాళ్లుగానే పరిగణించాల్సి ఉంటుంది.

ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా 2017 తర్వాత 4జీ సాంకేతికత అందుబాటులోకి రావడంతో భారతీయులు ఎక్కువగా ఫోన్లకు అతుక్కు పోయారు. సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ లాంటి యాప్‌ల వినియోగం పెరిగింది. చిన్నపిల్లవాడి దగ్గర్నుంచి మెుదలుపెడితే 60ఏళ్ల వ్యక్తి వరకు..అందరికీ ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ఆకౌంట్‌ ఉంటుంది. అంతలా సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ను భారతీయులు వినియోగిస్తున్నారు. తన డ్యాన్స్‌ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం ద్వారానే షాబాద్‌కు బార్బరా కలిసిందని అంటున్నాడు. అయితే, సోషల్‌ మీడియా ద్వారా పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా ఉన్నవారు 11శాతం కన్న తక్కువగా ఉంటారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇవి కొన్ని రోజుల వరకే బాగుంటాయని ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్న సంఘటనలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Read more : 1. ఇన్ ​స్టాలో పరిచయం.. ప్రియుడి కోసం భారత్ వచ్చిన పోలాండ్ మహిళ.. ఆరేళ్ల కూతురితో..

2. ఫేస్‌బుక్‌ లవ్​ .. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

3. 'సీమా హైదర్‌ పాకిస్థాన్​ ఏజెంట్‌?'.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.