ETV Bharat / business

ఆధార్ పేపర్​లెస్​​ ఆఫ్​లైన్​ e-KYC - 'ఎమ్ఆధార్'​ నయా ఫీచర్​ - ఆధార్​ ఆఫ్​లైన్ ఈకేవైసీ

MAadhaar Paperless Offline E KYC Feature In Telugu : ఆధార్​ ఈ-కేవైసీ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి యూఐడీఏఐ mAadhaar యాప్​లో ఒక సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. అదే పేపర్​లెస్ ఈ-కేవైసీ ఫీచర్​. దీనితో సులువుగా ఆఫ్​లైన్​లోనే కాగిత రహితంగా ఆధార్​ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా?

mAadhaar latest features
mAadhaar Paperless Offline eKYC Feature
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 11:40 AM IST

MAadhaar Paperless Offline E KYC Feature : ఎమ్​ఆధార్​ యాప్​లో 'పేపర్​లెస్​ ఆఫ్​లైన్ ఈ-కేవైసీ' ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. ఆధార్​ ఈ-కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి యూఐడీఏఐ ఈ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది.

పేపర్​లెస్​ ఆఫ్​లైన్​ ఈ-కేవైసీ
ఆధార్ ఈ-కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయడానికి అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీని వల్ల చాలా సమయం, డబ్బు వృథా అవుతాయి. పైగా పర్యవరణానికి కూడా నష్టం వాటిల్లుతుంది. దీనిని నివారించడానికే యూఐడీఏఐ mAadhaar యాప్​లో పేపర్​లెస్ ఆఫ్​లైన్​ ఈ-కేవైసీ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో యూజర్లు యాప్​లోనే షేరబుల్​ డాక్యుమెంట్లను రూపొందించుకోవచ్చు. వీటిని ఆఫ్​లైన్​లో ఆధార్​ అథంటికేషన్​ కోసం ఉపయోగించుకోవచ్చు.

ఈ-కేవైసీ ప్రాసెస్​

  • ముందుగా మీరు గూగుల్​ ప్లేస్టోర్​/ యాపిల్ స్టోర్​ నుంచి mAadhaar యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలి. లేదా
  • ఇప్పటికే మీరు mAadhaar యాప్​ డౌన్​లోడ్ చేసుకుని ఉంటే, దానిని అప్​డేట్ చేసుకోవాలి.
  • మీ రిజిస్టర్డ్​ ఫోన్​ నంబర్​, ఓటీపీలను ఉపయోగించి యాప్​లో లాగిన్ అవ్వాలి.
  • Aadhaar Servicesలో ఉన్న Paperless Offline e-KYC పై క్లిక్ చేయాలి.
  • ఆధార్​ నంబర్​, షేర్ కోడ్​, సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి, Request OTPపై క్లిక్​ చేయాలి.
  • మీ మొబైల్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, మీరు నమోదు చేసిన వివరాలను వెరిఫై చేసుకోవాలి.
  • Share e-KYC బటన్​పై క్లిక్ చేసి, మీకు నచ్చిన యాప్​ను ఎంచుకోవాలి.
  • తరువాత ఈ-కేవైసీకి కావాల్సిన పత్రాలను .zip fileగా క్రియేట్​ చేసుకోవాలి.
  • ఇలా సిద్ధం చేసుకున్న జిప్​ ఫైల్​ను ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఉపయోగించవచ్చు.

ఆఫ్​లైన్ వెరిఫికేషన్​
మీరు mAadhaar యాప్​లో క్రియేట్ చేసుకున్న జిప్​ ఫైల్​ను షేర్​ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​, షేర్ కోడ్​లు అవసరం అవుతాయి. మీరు వాట్సాప్​, ఈ-మెయిల్​ ద్వారా సర్వీస్​ ప్రొవైడర్లకు ఈ జిప్​ ఫైల్​ను సులువుగా పంపించవచ్చు. వారు ఈ డిజిటల్ పత్రాలను చూసి, ఆఫ్​లైన్​లోనే ఆధార్​ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనితో మీ ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియ సులువుగా పూర్తవుతుంది.

ఫోన్​పే యూజర్లకు గుడ్​న్యూస్ ​- ఫ్రీగా క్రెడిట్ స్కోర్​ చెక్ చేసుకోవచ్చు!

అమెజాన్ యూజర్లకు గుడ్​ న్యూస్​ - డబ్బులు లేకున్నా షాపింగ్ చేసే అవకాశం - ఎలా అంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.