ETV Bharat / business

ITR Last Date Extension : ఐటీఆర్​ ఫైలింగ్ గడువు పొడిగిస్తారా?.. ఆలస్యంగా ఫైల్​ చేసేందుకు అవకాశం ఉందా? - how to file itr after due date

Belated ITR Return Option : ఐటీఆర్​ దాఖలు గడువును పొడిగించాలని చాలా మంది టాక్స్ పేయర్స్​ ఆదాయపన్ను శాఖను అభ్యర్థిస్తున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం వల్ల చాలా మంది ఐటీఆర్​ దాఖలు చేయలేకపోయారు. అయినప్పటికీ ఇన్​కం టాక్స్​ డిపార్ట్​మెంట్​ ఇప్పటి వరకు గడువు పొడిగింపు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యంగానైనా ఐటీఆర్​ ఎలా దాఖలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Belated ITR Return Option
ITR Filing Last Date extension
author img

By

Published : Aug 1, 2023, 5:04 PM IST

Belated ITR Return Last Date : ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2023 జులై 31తో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ గడువును మరింత కాలం పొడిగించాలని చాలా మంది టాక్స్​ పేయర్స్ ఆదాయపన్ను శాఖను కోరుతున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమ వేదికల్లో నెటిజన్లు పదేపదే ఐటీఆర్​ ఫైలింగ్​ గడువు పొడిగించాలని అభ్యర్థిస్తున్నారు.

గడువు పొడిగించాలి!
ITR Last Date Extension : 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జులై 31. కానీ చాలా మంది వివిధ కారణాల చేత సకాలంలో ఐటీఆర్​ దాఖలు చేయలేకపోయారు. దీనితో వాళ్లు 'Extend ITR Deadline​' హ్యాష్​ట్యాగ్​తో ట్విట్టర్​లో పోస్టులు పెడుతున్నారు. ఇది ఇప్పుడు వైరల్​గా మారింది.

సాంకేతిక సమస్యలు!
ITR filing technical error : వాస్తవానికి ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనితో చాలా మంది సదరు వెబ్​సైట్​లో లాగిన్​ కాలేకపోయారు. మరికొందరు లాగిన్ అయినా కూడా రిటర్నులను దాఖలు చేయలేకపోయారు.

వర్షాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ కుదరలేదు!
భారతదేశంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీనితో ఆయా ప్రాంతాల ప్రజలు సకాలంలో ఐటీఆర్​ దాఖలు చేయలేకపోయారు. దీనితో వారు కూడా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు పెంచాలని అభ్యర్థిస్తున్నారు.

అధికారిక ప్రకటన రాలేదు!
ITR Filling Last Date Extension : ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నప్పటికీ.. ఐటీఆర్​ ఫైలింగ్ గడువు పొడిగింపు గురించి ఆదాయపన్ను శాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

భారీ పెనాల్టీ కట్టాల్సిందే!
Belated ITR filing : జులై 31తో గడువు ముగిసినప్పటికీ.. అపరాధ రుసుము చెల్లించి, ఇప్పుడు కూడా ఐటీఆర్​ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రూ.5000 పెనాల్టీ చెల్లించి.. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ రెండు విధాలుగానూ ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఈ విధంగా 2023 డిసెంబర్​ 31 లోపు బిలేటెడ్​ ఐటీఆర్​ దాఖలు చేయవచ్చు.

బిలేటెడ్ ఐటీఆర్​ ఎలా దాఖలు చేయాలి?
Guide to filling belated ITR :

  • ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్​సైట్ www.incometax.gov.in ఓపెన్ చేయాలి.
  • తరువాత 'Downloads' సెక్షన్​లోకి వెళ్లాలి.
  • Income Tax Returns ఆప్షన్​పై క్లిక్ చేయాలి. తరువాత మీకు సంబంధించిన సరైన ఐటీఆర్​ ఫారాన్ని డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • ఈ డౌన్​లోడ్​ చేసుకున్న ఫారంలో మీ వ్యక్తిగత, ఆదాయ వివరాలు నింపాలి. తరువాత దానితో XML షీట్​ని జనరేట్​ చేయాలి.
  • తరువాత మళ్లీ వెబ్​సైట్​లోకి వెళ్లి.. పాన్​ కార్డు వివరాలతో లాగిన్​ కావాలి.
  • వెబ్​సైట్​లోని ఈ-ఫైలింగ్​ మెనూను ఓపెన్​ చేయాలి.
  • తరువాత 'Income Tax Return' ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • తరువాత మీరు మిమ్మల్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
  • వెరిఫికేషన్​ పూర్తి అయిన తరువాత.. మీరు నింపిన XML ఫారాన్ని అప్​లోడ్​ చేసి, సబ్​మిట్ బటన్​పై క్లిక్​ చేయాలి.
  • అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్​ చేస్తే.. మీ ఐటీఆర్​ సబ్​మిట్​ అయిపోతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.