ETV Bharat / business

IRCTCలో రైలు టికెట్స్​ బుక్​ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి! - ఐఆర్‌సీటీసీ బీ2సీ

Rail ticket booking : రైలు టికెట్స్​ బుకింగ్​కు సంబంధించి ఐఆర్‌సీటీసీ పోర్టల్​​లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అత్యవసర పనుల మీద వెళ్లే చాలా మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రైన్​ టికెట్స్​ బుకింగ్​ కోసం ఇతర సంస్థల యాప్స్​, వెబ్​సైట్స్​ అందించే సేవలవైపు చూస్తున్నారు ప్యాసింజర్స్​. మరి ఈ సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

IRCTC B2C Alternatives
IRCTCలో రైలు టికెట్లు బుక్​ అవ్వట్లేదా.. వీటితో సులంభంగా బుకింగ్​​ చేసుకొండిలా..
author img

By

Published : Jul 25, 2023, 4:11 PM IST

Updated : Jul 25, 2023, 4:28 PM IST

IRCTC Ticket Booking : ప్రముఖ రైల్వే టికెట్​ బుకింగ్​ వెబ్​సైట్​ ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్​సైట్​, యాప్​లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా టికెట్​ బుకింగ్​ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనితో అత్యవసర పనుల మీద వెళ్లాలని అనుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేదేమి లేక ప్రత్యామ్నాయ ట్రైన్​ బుకింగ్​ ప్లాట్​ఫామ్స్​ వైపు చూస్తున్నారు. కాగా, తమ సేవల్లో కలుగుతున్న అంతరాయ విషయాన్ని ఐఆర్‌సీటీసీ తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్​ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి తమ వెబ్‌సైట్‌, యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ సర్వీసెస్​ అందుబాటులో లేవని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు తమ సీఆర్‌ఐఎస్‌ సాంకేతిక బృందం ప్రయత్నిస్తోందని తెలిపింది.

IRCTC B2C Partners : అయితే కేవలం రైల్వే శాఖ అధికారిక వెబ్​సైట్​ అయిన IRCTCలోనే కాకుండా మార్కెట్​లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వెబ్​సైట్స్, యాప్స్​ ద్వారా కూడా సులభంగా ట్రైన్​ టికెట్స్​ను బుక్​ చేసుకోవచ్చు. ఈ విషయం రైళ్లల్లో ప్రయాణం చేసే దాదాపు అందరికి తెలిసినా.. కొందరు వాటిని పెద్దగా వినియోగించుకోరు. ఇదిలా ఉంటే ప్రముఖ కంపెనీలు వినియోగదారుల కోసం టికెట్​ బుకింగ్​ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. వీటి ద్వారా మీ ప్రయాణాలను వాయిదా వేసుకోకుండా బయట పడతారు. అయితే ముఖ్యంగా రైలు టికెట్​ బుకింగ్​ సేవలను అందిస్తున్న కొన్ని సంస్థలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon Train Ticket Booking : ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ 'అమెజాన్'​ తమ వినియోగదారుల కోసం ఎప్పటి నుంచో రైల్వే టికెట్​ బుకింగ్​ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అందువల్ల అమెజాన్​లో ట్రైన్​ టికెట్స్​ను ఎలా బుక్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా అమెజాన్​ యాప్​ను తెరిచి అమెజాన్​ పే ట్యాబ్​ను సెలెక్ట్​ చేయండి.
  • అందులో బుక్​ టికెట్స్​ అనే ఆప్షన్​ను ఎంపిక చేసుకొని మీరు వెళ్లాల్సిన ట్రైన్​ పేరును ఎంచుకోండి.
  • తర్వాత మీరు దిగాల్సిన గమ్యం లేదా స్టేషన్​ను సెలెక్ట్​ చేయండి.
  • బుకింగ్​ సమయంలో కావాల్సిన వివరాలను ఎంటర్​ చేయండి. ఉదాహరణకు తేదీ, సమయం.
  • మీరు ఏసీ తరగతిలో ప్రయాణించాలనుకుంటే గనుక యాప్​లో సంబంధిత విభాగాన్ని ఎంచుకోండి.
  • ఇక ఇతర ట్రైన్​ వివరాల కోసం 'ఫైండ్​ ట్రైన్స్​' ఆప్షన్​ను ఎంపిక చేసుకొని ఫీల్టర్స్​ సాయంతో మీకు కావాల్సిన సమాచారాన్న పొందొచ్చు. ఉదాహరణకు అందుబాటులో ఉన్న రైళ్లు, ఏ మార్గం ద్వారా అవి వెళ్తాయి అనే వివరాలను తెలుసుకోవచ్చు.
  • అనంతరం మీరు ప్రయాణించాల్సిన ట్రైన్ ఆప్షన్​​​ను సెలెక్ట్​ చేసుకోండి.
  • జనరల్​, సీనియర్ సిటిజన్​, లేడీస్​ లాంటి కేటగిరీలలో మీరు ఏ కేటగిరీకి చెందుతారో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • చివరగా.. ఎంటర్ చేసిన వివరాలను ఒకసారి చెక్​ చేసుకొని ప్రొసీడ్​ బటన్​పై క్లిక్​ చేయండి.
  • పూర్తి వివరాలు ఎంటర్​ చేశాక మీకు సౌకర్యవంతంగా ఉండే పేమెంట్​ విధానాన్ని ఎంచుకోవచ్చు.
  • అయితే బుకింగ్​ సమయంలో ప్రయాణికుడు ఐఆర్​సీటీసీ అకౌంట్​ ఐడీ, పాస్​వర్డ్​ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ అకౌంట్​ లేకపోతే ఐఆర్​సీటీసీ అధికారిక వెబ్​సైట్​లో క్రియేట్​ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్​ అమెజాన్​​లోనూ అందుబాటులో ఉంటుంది.

Paytm IRCTC Booking : ప్రముఖ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ సంస్థ పేటీఎం ద్వారా కూడా సులభంగా రైలు టికెట్స్​ను బుక్​ చేసుకోవచ్చు.

  • ముందుగా https://paytm.com/train-tickets వెబ్​సైట్​ను ఓపెన్​ చేయండి.
  • మీరు వెళ్లాల్సిన గమ్య స్థానాన్ని తేదీతో సహా ఎంచుకోండి.
  • సెర్చ్​ బటన్​పై క్లిక్​ చేయండి. అందుబాటులో ఉన్న ట్రైన్లు, మీకు నచ్చిన సీట్లు, తరగతి, తేదీని సెలెక్ట్​ చేసుకోండి.
  • బుక్​ బటన్​పై ట్యాప్​ చేయండి. తర్వాత మీ ఐఆర్​సీటీసీ లాగిన్​ ఐడీని ఎంటర్​ చేయండి.
  • యాప్​లో అడిగే వివరాలన్నీ నింపిన తర్వాత బుక్ బటన్​పై క్లిక్​ చేయండి.
  • చివరగా పేమెంట్​ చేసే విధానాన్ని ఎంచుకోండి. డెబిట్​, క్రెడిట్​, నెట్​ బ్యాంకింగ్​ లేదా పేటీఎం వ్యాలెట్​ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చు. దీంతో మీ ట్రైన్​ టికెట్​ బుక్​ అయిపోతుంది. దీనితోపాటు ట్రావెల్స్​ యాప్​ మేక్​మైట్రిప్​లో కూడా రైలు టికెట్స్​ను బుక్​ చేసుకోవచ్చు.

Last Updated : Jul 25, 2023, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.