ETV Bharat / business

How to Use SBI WhatsApp Banking Services : వాట్సాప్​లో SBI సేవలు.. ఏం చేయొచ్చంటే..? - ఎస్​బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ నంబర్

How to Use SBI WhatsApp Banking Services : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ గతేడాది తమ కస్టమర్స్​ కోసం 'ఎస్​బీఐ వాట్సాప్​ బ్యాంకింగ్'​ పేరుతో కొత్త అప్డేట్​ను తీసుకువచ్చింది. మరి దీని కింద వినియోగదారులకు అందుబాటులో ఉన్న సేవలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

SBI WhatsApp Banking Services
ఎస్​బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 4:08 PM IST

How to Use SBI WhatsApp Banking Services : ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ) తమ వినియోగదారులకు బ్యాంకింగ్​ సేవలను మరింత చేరువ చేసేందుకు గతేడాది ఓ సరికొత్త అప్డేట్​ను ప్రవేశపెట్టింది. అదే 'ఎస్​బీఐ వాట్సాప్​ బ్యాంకింగ్​' ఫీచర్. అంటే దీని సాయంతో మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ ద్వారానే మన బ్యాంక్​ లావాదేవీలన్నింటినీ చక్కబెట్టేసుకోవచ్చు. మరి ఈ ఫీచర్​తో ఎస్​బీఐ అందిస్తున్న సర్వీసులేంటో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ బ్యాంకింగ్​ ద్వారా ఎస్​బీఐ అందిస్తున్న సర్వీసులివే..

  • అకౌంట్​ బ్యాలెన్స్ చెకింగ్
  • మినీ స్టేట్​మెంట్​(గత 5 ట్రాన్సాక్షన్స్​)
  • పెన్షన్​ స్లిప్
  • సేవింగ్స్ అకౌంట్​, రికరింగ్ డిపాజిట్లు, టెర్మ్​ డిపాజిట్లు, వడ్డీ రేట్లు సహా ఇతర డిపాజిట్​ ప్రొడక్ట్​లకు సంబంధించిన వివరాలను వాట్సాప్​ బ్యాంకింగ్​ ద్వారా తెలుసుకోవచ్చు.
  • హోమ్​ లోన్​, కార్​ లోన్​, గోల్డ్​ లోన్​, పర్సనల్​ లోన్​, ఎడ్యుకేషన్​ లోన్​ సహా ఇతర రుణాలకు సంబంధించి వాటి వివరాలు, వడ్డీ రేట్లను కూడా తెలుసుకోవచ్చు.
  • NRE అకౌంట్​, NRO అకౌంట్​కు సంబంధించి ఎన్​ఆర్​ఐ సేవలను కూడా పొందవచ్చు. వీటికి సంబంధించి వడ్డీ రేట్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
  • బ్యాంకు అందిస్తున్న సేవలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలను కూడా వాట్సాప్​ బ్యాంకింగ్​ ద్వారా పొందవచ్చు. ఉదాహరణకు బ్యాంక్​ ప్రొడక్ట్​ల ఫీచర్లు, కావాల్సిన అర్హతలు తదితరాలు.
  • కాంటాక్ట్స్ / గ్రీవెన్స్ రిడ్రెస్సల్ హెల్ప్‌లైన్‌ నంబర్​లు కూడా వాట్సాప్​ బ్యాంకింగ్​లో అందుబాటులో ఉంటాయి.
  • ప్రీ-అప్రూవ్డ్ లోన్​కు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇక్కడ మనం పొందగలము. ఉదాహరణకు వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు(కార్​ లోన్​,​ టూ-వీలర్​)

ఎస్​బీఐ వాట్సాప్​ బ్యాంకింగ్​ సర్వీస్​కు రిజిస్టర్​ అవ్వండిలా..
SBI WhatsApp Banking Service Register :

  • బ్యాంకుకు సమర్పించిన మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్ నుంచి 9022690226 నంబర్​కు WAREG అని టైప్​ చేసి స్పేస్​ ఇచ్చి మీ 12 అంకెల బ్యంక్​ అకౌంట్​ నంబర్​ను ఎంటర్​ చేసి మెసేజ్​ చేయండి.
  • ఇలా ఎస్​బీఐ వాట్సాప్​ బ్యాంకింగ్​లో మీ పేరు నమోదు అవుతుంది. దీంతో మీరు ఎస్​బీఐ వాట్సాప్​ బ్యాంకింగ్ సేవలను ఉచితంగా పొందగలుగుతారు.
  • 9022690226 నంబర్​ నుంచి మీ వాట్సాప్​కు ఓ సందేశం వస్తుంది. ఆ నంబర్​కు హాయ్​ అని మెసేజ్​ పెట్టండి. అనంతరం బ్యాంక్​ అడిగే సూచనలను అనుసరించండి.
  • ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, డీరిజిస్టర్ వాట్సాప్ బ్యాంకింగ్ ఆప్షన్​లను మీకు అందిస్తారు.
  • అకౌంట్​ బ్యాలెన్స్‌ను చెక్​ చేయడానికి '1' టైప్ చేయాలి. మినీ స్టేట్‌మెంట్ కోసం '2' అంకెను నొక్కండి.

Bank Strike News : కస్టమర్​లకు అలర్ట్.. 10 రోజులు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఎప్పుడంటే..

Flipkart Big Billion Days Start Date : ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలివే.. ఆ ప్రొడక్ట్స్​పై 90 శాతం డిస్కౌంట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.