ETV Bharat / business

How to Use BIS care App to Check Gold Purity: మీరు కొన్న బంగారం స్వచ్ఛమైనదా? నకిలీదా..? ఇలా చెక్ చేయండి! - బంగారం నాణ్యతను ఎలా చెక్ చేసుకోవాలి

How to Use BIS care App to Check Gold Quality : బంగారం క్వాలిటీ చెక్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇమిటేషన్ జ్యూయలరీకీ.. నిజమైన బంగారానికి తేడా తెలుసుకోలేని వారు ఎందరో..! అయితే.. ఈ ప్రాబ్లం క్లియర్ చేసేందుకు BIS Care యాప్​ అనేది ఒకటుందని మీకు తెలుసా..? మరి, దాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.

How to Use BIS care App to Check Gold Quality
How to Use BIS care App to Check Gold Purity
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 3:10 PM IST

BIS care App to Check Gold Quality in Online : బంగారం ఆభరణాల కొనుగోలు విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. ఎంత పేరున్న షాపులో కొన్నాగానీ.. అనుమానం మాత్రం పోదు. ఎందుకంటే.. కేవలం బంగారాన్ని చూసి, లేదా పట్టుకొని క్వాలిటీ చెక్ చేయడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే.. నగల పైన హాల్‌మార్క్ ఉన్నాసరే.. కొనుగోలు దారుల్లో ఆందోళన ఉంటుంది. ఈ అనుమానాలు తీర్చేందుకే.. కేంద్ర ప్రభుత్వం ఓ యాప్​ను రూపొందించింది. అదే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్​కి చెందిన యాప్​. దీనిని ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి..? ఇది ఎలా పని చేస్తుంది..? లాంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold Hallmarking 3rd Phase : గోల్డ్​ హాల్​మార్కింగ్ 3వ దశ ప్రారంభం.. ఏపీ, తెలంగాణలో ఎక్కడంటే?

BIS-కేర్ యాప్ అంటే ఏమిటి?

What is BIS Care App..?: BIS-కేర్ యాప్ ద్వారా.. ISI, హాల్‌మార్క్ నాణ్యత, ధ్రువీకరణ పొందిన ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయొచ్చు. ఇది వినియోగదారులకు ఉత్పత్తుల ప్రామాణికత గురించి తెలుసుకునేందుకు.. అలాగే, ప్రామాణికం కాని ఉత్పత్తుల గురించి ఫిర్యాదులను కూడా నమోదు చేయడానికి అనుమతిస్తుంది. ఈ అప్లికేషన్.. హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంది.

BIS కేర్ యాప్​ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?

How to Download BIS Care App..?: BIS కేర్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. iOS వినియోగదారులకు లభ్యతపై ఎటువంటి సమాచారం లేదు. దీనిని ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా.. Google Play స్టోర్‌కి వెళ్లండి.
  • సెర్చ్ బార్‌లో BIS-కేర్ యాప్ కోసం వెతకండి.
  • అనంతరం ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు యాప్​ ఇన్​స్టాల్​ అవుతుంది.
  • యాప్​ ఓపెన్​ చేసిన తర్వాత స్క్రీన్​ మీద పలు రకాలు సర్వీసులు కనిపిస్తాయి.
  • ముందుగా మీరు రిజిస్ట్రేషన్​ కంప్లీట్​ చేసుకోవాలి.
  • అందుకోసం యాప్​ స్క్రీన్​ మీద ఎడమవైపున ఉన్న మూడు లైన్ల సింబల్​పై క్లిక్​ చేయండి.
  • ఆ తర్వాత Sign In ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • ఆ తర్వాత New User Registration ను ఎంచుకోండి.
  • మీ వివరాలు ఎంటర్​ చేసి Submit బటన్​ను నొక్కండి(పేరు, ఫోన్​ నెంబర్​, మెయిల్​ ఐడీ )
  • తర్వాత మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​కు​ వచ్చిన ఓటీపీ ని ఎంటర్​ చేసి వెరిఫై చేసుకోండి.
  • మీరు విజయవంతంగా రిజిస్టర్​ అవుతారు.
  • ఈ యాప్​ను అనుసరించి, మీరు ఉత్పత్తుల నాణ్యతను ధృవీకరించడం ప్రారంభించవచ్చు.
  • అలాగే ఉత్పత్తుల నాణ్యత, ISI మార్క్ దుర్వినియోగం, హాల్‌మార్క్ వంటి సమస్యలపై ఫిర్యాదులను కూడా ఫైల్ చేయవచ్చు.

వినియోగదారులు బంగారం నాణ్యతను ఎలా చెక్ చేసుకోవాలి?

How to Check Gold Quality in BIS Care App..?

  • ముందుగా మీరు BIS Care యాప్​ను ఓపెన్​ చేయండి.
  • తర్వాత Verify HUID ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత బంగారం ఆభరణంపై ఉన్న HUID నంబర్​ను ఎంటర్​ చేసి.. సెర్చ్​ చేయాలి.
  • వెంటనే మీకు సదరు ఆభరణంలోని బంగారం స్వచ్ఛత వివరాలు కనిపిస్తాయి.

ఈ యాప్‌తో.. వినియోగదారులు పూర్తి ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థను యాక్సెస్ చేయవచ్చు. దీనికి అదనంగా, ప్రమాణాల అమలును మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఎలక్ట్రానిక్-బీఐఎస్‌ను అభివృద్ధి చేస్తోంది. వినియోగదారుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆమోదాల సమర్పణ, మరిన్నింటి కోసం.. త్వరలో వినియోగదారుల ఎంగేజ్‌మెంట్ పోర్టల్ కూడా ప్రవేశపెట్టనుంది.

Gold Purity Check : శ్రావణమాసంలో బంగారం కొనాలా?.. ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోండి ఇలా?

How to Apply for Gold Monetization Scheme : ఈ స్కీమ్​లో చేరండి.. మీ ఇంట్లో ఉన్న బంగారంతో డబ్బులు సంపాదించండి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.