ETV Bharat / business

How to Recharge FASTag With Google Pay: ఇప్పుడు Gpayతో క్షణాల్లో ఫాస్టాగ్​ రీఛార్జ్.. ట్రై చేశారా..? - టోల్​ ప్లాజాల వద్ద క్యూలో

How to Recharge FASTag With GPay: వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు టోల్​ ప్లాజాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోందనే ఉద్దేశ్యంతో.. టోల్​ రుసుము చెల్లించడానికి ఫాస్టాగ్ పేమెంట్ వచ్చింది. అయితే.. ఇప్పుడు దీని రీఛార్జ్ కూడా ఒక్కోసారి ఆలస్యమవుతోందని కొందరు ఫీలవుతున్నారు. ఇలాంటి వారు గూగుల్ పే ద్వారా ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు.

How to Recharge FASTag using GPay
How to Recharge FASTag With Google Pay
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 11:03 AM IST

How to Recharge FASTag With Google Pay: రహదారులపై ప్రయాణీకులు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.. హైవేల మీదున్న టోల్ ప్లాజాలను దాటడం. ఇక్కడ ఉండే పొడవైన క్యూను దాటేందుకు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక, పండగ సమయాల్లోనైతే.. చెప్పాల్సిన పనిలేదు. గంటలకొద్దీ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. దీనివల్ల చాలా సమయం అక్కడే వృథా అవుతుంది. అయితే.. ఇలా టైమ్ వేస్ట్​ కాకుండా.. కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్​ని ప్రవేశపెట్టింది. దీనిని డిసెంబర్ 2019 నుంచి నాలుగు చక్రాలు, ఆపై ఉన్న వాహనాలకు తప్పనిసరి చేసింది. దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను ఫాస్టాగ్​తో అనుసంధానం చేశారు.

How To Add Bank Account In Google Pay: గూగుల్ పేలో బ్యాంక్ ఖాతా ఇలా యాడ్ చేయండి.. పిన్ అలా ఛేంజ్ చేయండి..

ఫాస్టాగ్​ అంటే ఏమిటి?:

What is FASTag: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సహాయంతో భారత ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్‌ను (NETC) సూచించే ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమం ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా టోల్ టాక్స్ వసూలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్‌నే ఫాస్టాగ్​ అని పిలుస్తారు. ఇది టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫాస్టాగ్​ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(RFID) టెక్నాలజీని ఉపయోగించే పరికరం.

వాహనం.. టోల్ ప్లాజా ఫాస్టాగ్​ లైన్​లో వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీలను కట్​ చేస్తుంది. ఫోర్​ వీలర్స్​ ముందు విండో స్క్రీన్‌పై ఫాస్టాగ్​ స్టిక్కర్ అతికిస్తారు. ఈ స్టిక్కర్ అతికించి ఉన్న వాహనాలు.. టోల్‌ను దాటినప్పుడు వాహనంతో లింక్ చేసిన ఫాస్టాగ్​ ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా కట్​ అవుతుంది.

UPI Money Sent To Wrong Recipient? What next? : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బు పంపిస్తే.. ఏం చేయాలి?

Google Pay FASTag Recharge: అయితే.. ఫాస్టాగ్​​ వినియోగదారులు రీఛార్జ్ కోసం ఇబ్బందులు పడకుండా.. కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్​​ ఖాతాను సులభంగా రీఛార్జ్‌ చేసుకునేందుకు యానిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేజ్‌ (UPI) సదుపాయాన్ని కల్పించింది. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని.. గూగుల్‌ పే ద్వారా వెంటనే రీఛార్జ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు పేమెంట్‌ ట్రాక్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి, గూగుల్​ పేకు ఫాస్టాగ్​​ ఖాతాను ఏ విధంగా లింక్​ చేసుకుని రీఛార్జ్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Google Payతో ఫాస్టాగ్ని రీఛార్జ్ చేయడం ఎలా..?

Simple Steps to Recharge FASTag With Google Pay:

  • ముందుగా ఫోన్‌లో Google Pay యాప్‌ని ఓపెన్​ చేయాలి.
  • తర్వాత బిల్స్​ అండ్​ రీఛార్జ్​ కాలమ్​లోకి వెళ్లి "SEE ALL" బటన్‌పై క్లిక్​ చేయాలి.
  • అక్కడ "FASTag Recharge" ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • మీ ఫాస్టాగ్​ని జారీ చేసిన బ్యాంకును ఎంచుకోవాలి.
  • మీ వాహనం నంబర్‌ను నమోదు చేసి అకౌంట్​ను లింక్​ చేసుకోవాలి.
  • అనంతరం మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్​ చేసి.. రీఛార్జ్​ చేసుకోవాలి.

Personal loan on Google Pay: మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా.. అయితే, మీకు లక్ష దాకా రుణం వచ్చేసినట్టే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.