How to Know LIC Policy Details through Whatsapp : జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో పాలసీదారులు తాము కడుతున్న పాలసీకి సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే దగ్గరలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే మొబైల్‌లోనే ఎల్‌ఐసీ సర్వీసులను అందించే.. విధంగా ఎల్‌ఐసీ వాట్సాప్ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ, చాలా మందికి ఇప్పటికీ ఎల్‌ఐసీ(LIC) అందిస్తున్న వాట్సాప్ సేవల గురించి సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసమే ఇది. మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉండి, వాట్సాప్ సేవల్ని ఎలా పొందాలో తెలియకపోతే ఈ స్టోరీ చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.
LIC WhatsApp Services : ఎల్‌ఐసీ మొత్తం 10 రకాల సేవలను వాట్సాప్(WhatsApp)లో అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారులు ఎల్‌ఐసీ కేటాయించిన వాట్సాప్ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపిస్తే చాలు.. ఈజీగా ఆ సేవలను పొందొచ్చు. ఇంటి వద్ద నుంచే యాక్సెస్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. మీరు ఈ సేవల్ని పొందాలంటే ముందుగా ఎల్‌ఐసీ పోర్టల్‌లో మీ పాలసీ నమోదు చేసుకోవాలి. అప్పుడే వాట్సాప్ ద్వారా మొబైల్ నంబర్ నుంచి ఎల్‌ఐసీ అందించే సర్వీసుల్ని పొందుతారు. ఇంతకీ ఏయే సేవలు లభిస్తాయి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? వివరాలను ఎలా పొందాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎల్‌ఐసీ వాట్సాప్ సర్వీసులివే..
- ప్రీమియం బకాయి తేదీ వివరాలు
- బోనస్ సమాచారం
- పాలసీ స్టేటస్
- పాలసీపై వచ్చే రుణ సమాచారం
- రుణం తిరిగి చెల్లింపు
- లోన్‌పై వడ్డీ కట్టాల్సిన తేదీ
- ప్రీమియం చెల్లింపు సర్టిఫికెట్
- యులిప్- యూనిట్ల స్టేట్‌మెంట్
- ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింకులు
- ఆప్ట్ ఇన్/ఆప్ట్ ఔట్ సేవలు
- ఎండ్ కన్వర్జేషన్
How to Register for LIC Whatsapp Services in Telugu :
వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవల కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే.. ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొంటేనే పైన పేర్కొన్న సేవలను వాట్సాప్‌లో పొందే వీలుంటుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్‌ను గానీ, మీ ఎల్‌ఐసీ పాలసీ వివరాలను గానీ నమోదు చేసుకోకపోతే ఈ సేవలను పొందలేరనే విషయం గుర్తుంచుకోవాలి. అందుకోసం పాలసీ నెంబర్, పాలసీల ఇన్స్టాల్మెంట్ ప్రీమియమ్స్, పాస్‌పోర్ట్/ పాన్ కార్డ్ స్కాన్డ్ కాపీ( సైజు- 100కేబీ లోపల) అవసరం. ఇక మీరు రిజిస్టర్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే చేసుకోండిలా..
- ముందుగా మీరు www.licindia.in అనే వెబ్సైట్లోకి వెళ్లి కస్టమర్ పోర్టల్ అప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీరు కొత్త యూజర్ అయితే New Userపై క్లిక్ చేయాలి.
- అనంతరం ఐడీ, పాస్వర్డ్ మీద క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ మీద నొక్కాలి.
- ఆ తర్వాత కొత్తగా వచ్చిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- ఆపై బేసిక్ సర్వీసెస్ విభాగంలో యాడ్ పాలసీని క్లిక్ చేసి ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీల వివరాలు అక్కడ నమోదు చేసుకోవాలి.
- మీరు ఎల్‌ఐసీ పోర్టల్‌లో ఒక్కసారి రిజిస్టర్ అయితే.. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ వంటి ప్రాథమిక వివరాలు ఆటోమెటిక్‌గా వచ్చేస్తాయి.
How to Activate LIC WhatsApp Services in Telugu :
ఎల్‌ఐసీ వాట్సాప్ సేవలను యాక్టివేట్ చేసుకోండిలా.. ఎల్‌ఐసీ పోర్టల్‌లో పాలసీలను రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు.. వాట్సాప్ సేవలను ఈజీగా పొందవచ్చు. అది ఎలాగంటే..
- ముందుగా ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్ నంబర్ '89768 62090' ను మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఎల్‌ఐసీ చాట్ బాక్స్‌లోకి వెళ్లాలి.
- అప్పుడు మీరు Hai అని మెసేజ్ పంపగానే.. మీకు ఎల్‌ఐసీ అందించే సేవల వివరాలు నంబర్ల రూపంలో కనిపిస్తాయి.
- అందులో మీకు కావాల్సిన సేవల నంబర్‌ను ఎంచుకుంటే చాలు.. ఆ వివరాలు అక్కడ డిస్ప్లే అవుతాయి.
Life Insurance Vs Term Insurance : లైఫ్ ఇన్సూరెన్స్ VS టర్మ్ ఇన్సూరెన్స్.. ఏది బెస్ట్ ఆప్షన్?